Begin typing your search above and press return to search.

రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బుల క‌ల్చ‌ర్‌: స‌ర్కారుపై చంద్ర‌బాబు ఫైర్‌

By:  Tupaki Desk   |   17 Jan 2022 2:44 PM GMT
రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బుల క‌ల్చ‌ర్‌:  స‌ర్కారుపై చంద్ర‌బాబు ఫైర్‌
X
రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బుల క‌ల్చ‌ర్ పెరిగిపోయింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న ప్ర‌భుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు వెంటనే సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. కరోనా వల్ల 12 రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ధాన్యం రైతులకు సకాలంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన కంది, మిర్చి రైతులను ఆదుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కేసినో కల్చర్, పేకాట క్లబ్బులు పెరిగాయని విమర్శించారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగన్‌రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులకు టీడీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అధికార పార్టీ అరాచకాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. కరోనా దృష్ట్యా 12కిపైగా రాష్ట్రాల్లో స్కూళ్లు మూసివేశారని చెప్పారు. ఏపీలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్లు పెట్టడం దుర్మార్గమన్నారు. స్కూళ్ల నిర్వహణపై సీఎం మూర్ఖంగా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. స్కూళ్లలో తరగతులను తక్షణమే వాయిదా వేయాలని సూచించారు. పంటనష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం డబ్బులను సకాలంలో చెల్లించాలన్నారు.

ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరి దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల పోరాటానికి అండగా నిలవాలన్నారు. టీడీపీ హయాంలో పారిశ్రామికాభివృద్ధిలో ఏపీ నెంబ‌ర్ 1గా నిలిచిందని చెప్పారు. జగన్‌రెడ్డి హయాంలో గోవా క్యాసినో కల్చర్, పేకాట క్లబ్బులు డ్రగ్స్‌, గంజాయిలో ఏపీ నెంబర్ 1గా నిలిచిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. గుడివాడలో క్యాసినో నిర్వహించిన మంత్రి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి వ్య‌వ‌హారాన్ని ప్ర‌జా క్షేత్రంలోకి తీసుకువెళ్లి.. మంత్రి దుర్మార్గాల‌ను.. ఎండ‌గ‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ఎక్క‌డిక‌క్క‌డ దోచుకునే సంస్కృతికి జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం త‌లుపులు తెరిచింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌యం లో ప్ర‌భుత్వ తీరును ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. వివ‌రించాల‌ని పార్టీ శ్రేణుల‌ను చంద్ర‌బాబు కోరారు.