చంద్రబాబు.. మరో బేల మాట!

Thu Apr 25 2019 17:46:05 GMT+0530 (IST)

Chandrababu Naidu Allegations on YSRCP Over Polling

ఎన్ని అరాచకాలు చేయచ్చో అన్నీ చేశారు..' ఇదీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి తాజా లీక్. పార్టీ శ్రేణులతో చంద్రబాబు నాయుడు నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్య చేశారట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అరాచకాలు చేశారని బాబు అంటున్నారు.  పోలింగ్ సందర్భంగా ఆ పార్టీ తీవ్రమైన అరాచకాలకు పాల్పడినట్టుగా బాబు వ్యాఖ్యానించారు.ఈ మాట ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నారు కానీ.. వినే వాళ్లకు ఇది మరోలా వినిపిస్తూ ఉంది. సాధారణంగా ఓడిపోయిన వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. 'అరచకాలకు పాల్పడి వారు విజయవం సాధించారు..' అంటూ గెలిచిన వారిపై ఓడిన వారు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇలాంటి డైలాగులు రాజకీయాల్లో మామూలే.

మరి ఆ డైలాగులను చంద్రబాబు  నాయుడు ఇప్పుడే ప్రయోగిస్తూ ఉండటం మాత్రం  చర్చనీయంశంగా మారుతూ ఉంది. ఇంకా ఎన్నికల ఫలితాలు రాలేదు. అయితే బాబు ఇప్పటికే రకరకాలుగా మాట్లాడారు. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని - ఈవీఎంలతో అక్రమాలు చేశారని - సైకిల్ కు ఓటేస్తే ఫ్యాన్ కు పడిందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు 'అరాచకాలు కూడా...'అంటూ బాబు వ్యాఖ్యానించారు.
 
ఇది బేల మాట అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓడిపోయాకా సాకులు చెప్పినట్టుగా బాబు ఫలితాలకు ముందే ఇలా మాట్లాడటం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే  బాబు మరో మాటా చెబుతున్నారు. 'వారు అన్ని అరాచకాలకు పాల్పడినా విజయం టీడీపీదే...' అని బాబు అంటున్నారు మరి!