ఎయిమ్స్‌కు నీళ్లివ్వలేని జగన్.. పేరు మారుస్తారా? .. చంద్రబాబు ఫైర్

Mon Sep 26 2022 20:20:24 GMT+0530 (India Standard Time)

Chandra babu fire on jagan

వైద్యరంగంపై తప్పుడు ప్రకటనలు చేయడం సీఎం జగన్ మానుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు హితవు పలికారు. సీఎం తొలుత ఎయిమ్స్‌లో నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో ఎయిమ్స్‌కు భూమి కేటాయించి వసతులు కల్పించామన్నారు. ఎయిమ్స్ కోసం జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎయిమ్స్‌లో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు సూచించారు.వైద్య రంగంపై సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు మాని.. ముందు ఎయిమ్స్ నీటి సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్కు కనీసం నీటి సరఫరా చేయలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలంటూ మండిపడ్డారు. అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. ఇది మానేసి.. ఉన్న సంస్థలకు పేర్లు మార్చే పని ఎందుకని నిలదీశారు.

అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో అబద్దాలు చెప్పిన ముఖ్యమంత్రి... తానుంటున్న మునిసిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్  సంస్థ పెరిగిన తమ అవసరాల కోసం అదనంగా నీటి వనరులను సమాకూర్చాలని లేఖలు రాసినా పరిష్కరించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో సైతం అసత్యాలు చెప్పుకొన్న ముఖ్యమంత్రి... తానుంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. స్వయంగా కేంద్ర మంత్రులు సైతం నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందించని ఈ ముఖ్యమంత్రి... వైద్య రంగంలో సమూల మార్పులు తన వల్లే అని బొంకుతున్నాడని నిప్పులు చెరిగారు. మీ చేతగానితనం లక్షల మంది ప్రజలకు శాపంగా మారకూడదన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.