అమెరికాకు చంద్రబాబు.. రెస్ట్ కోసమేనా?

Mon Apr 19 2021 10:00:01 GMT+0530 (IST)

Chandra Babu Going To America

టీడీపీ అధినేత ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రెస్ట్ కోరుకుంటున్నారా? ఈ క్రమంలో ఆయన త్వరలోనే  అగ్రరాజ్యం అమెరికాకు పయనమవుతున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి పార్టీ వర్గాలు. మరి దీనికి రీజనేంటి? అంటే.. ప్రస్తుతం ఆయన రాజకీయం గా చాలా క్లిస్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ముందు చాలా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. గతంలో అనేక మంది రాజకీయ నేతలను ఉద్ధం డులను చూసిన చంద్రబాబు.. ఆదిలో జగన్‌ను చాలా తక్కువగానే అంచనా వేసుకున్నారు.కానీ జగన్‌కు ఉన్న ప్రజాబలం.. ఆయన రాజకీయ వ్యూహాలు వంటి కీలక అంశాల ముందు చంద్రబాబు చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబుకు ఆయన పార్టీ నేతల కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మరీ ముఖ్యంగా అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఉంటుందని భావించిన విజయవాడ గుంటూరు కార్పొరేషన్లు.. సైతం.. టీడీపీకి దక్కకుండా పోయాయి. దీంతో అప్పటి వరకు రాజధాని నినాదం వినిపించిన.. ఈ సెంటిమెంటు అయినా.. కాపాడుతుందని భావించిన పార్టీ నేతలకు చంద్రబాబుకు తీవ్ర షాక్ తగిలింది.

దీంతో పరిషత్ ఎన్నికలను బాబు బహిష్కరించారు. అయినా.. ఎక్కడా తనకు అనుకూలంగా సెంటిమెంటును ఆయన పండించుకోలేక పోతున్నారు. ఇంతకుముందు.. కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా.. ఇంత దారుణమైన పరాభవాలను ఆయన ఎన్నడూ చవిచూడలేదు. ఇక ఇటీవల జరిగిన తిరుపతి ఉప ఎన్నికలోనూ పరాభవం తప్పదనే సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తలబొప్పికట్టిన చంద్రబాబు ఎంతైనా.. కొంత మేరకు రిలాక్స్ అవ్వాలని భావించారు. ఈ క్రమంలోనే ఆయన అమెరికాకు ప్రయాణం కట్టాలని భావిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

ఈ క్రమంలో అమెరికాలో ఓ నెల రోజులు ఉండి.. అక్కడ ఎన్నారైలను కలిసి రావాలని.. అదేవిధంగా చం ద్రబాబు ఆరోగ్యం కూడా చెకప్ చేయించుకుని రావాలని కూడా అనుకుంటున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అగ్రరాజ్యం టూర్‌కు వెళ్తే.. పార్టీని లోకేష్ నడిపించగలడా అనే చర్చ తెరమీదకి వచ్చింది. ఎందుకంటే.. ఇటీవల  పార్టీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు.. చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో.. ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. పైకి సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. టీడీపీలో లోలోపల మాత్రం దీనిపై ఆసక్తికర డిబేట్ జరుగుతోంది.

ఈ క్రమంలో చంద్రబాబు పర్యటనపై పలు ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చంద్రబాబు వెళ్తారా?  లేక.. హైదరాబాద్‌లోనే ఉండి.. అచ్చెన్నకు-లోకేష్‌కు మధ్య పెరుగుతున్న గ్యాప్ ను తగ్గించేందుకు సయోధ్య చేస్తారా? అనే చర్చ కూడా సాగుతోంది. సీనియర్ నాయకులు.. లోకేష్‌కు సహ కరించే పరిస్థితి లేదు అని కూడా అంటున్నారు. ``చంద్రబాబుకు రెస్పెక్ట్ ఇస్తాం కానీ లోకేష్‌కు అంత సీన్ లేదు. ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదు`` అని అంటున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాదు .. మేం పార్టీలో ఎంతో కాలం నుంచి ఉన్నామని అయితే.. తమను పురుగును చూసినట్టు చూస్తున్నాడని.. కూడా కొందరు మాజీ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇలా.. మొత్తానికి టీడీపీ పరిస్థితి కొంత గందరగోళంగా ఉండడం గమనార్హం.  మరి ఇది ఎప్పటికి చల్లారుతుందో చూడాలి.