చలసాని శ్రీనివాస్ చంద్రబాబు కోవర్ట్..?

Tue Feb 12 2019 11:58:12 GMT+0530 (IST)

Chalasani Srinivas Is Behave like Chandrababu naidu Covert

ఆంధ్ర మేధావుల సంఘం పేరుతో చలామణిలో ఉన్న చలసాని శ్రీనివాస్ చంద్రబాబు నాయుడుకు కోవర్ట్ గా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు పరిశీలకులు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవకాశవాదం కొద్దీ వ్యవహరిస్తూ ఉంటే దానికి తందానా అంటున్నాడు చలసాని. ఒకవైపు ప్రత్యేకహోదా ఉద్యమకారుడిగా తనను తాను ప్రచారం చేసుకుంటున్న చలసాని.. మరోవైపు చంద్రబాబుకు అనుగుణంగా ఆడుతూ ఉండటం గమనార్హం.ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ వ్యవహరించిన తీరు ఏమిటో ఏపీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ప్రత్యేకహోదా పోరాటాన్ని గతంలో తీవ్రంగా తప్పు పట్టాడు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల ముందేమో హోదా కావాలని అని… ఎన్నికల తర్వాత బాబు మాటలు మారుస్తూ వచ్చాడు. హోదా అవసరం లేదని అన్నాడు. హోదా సంజీవని కాదు అన్నాడు. హోదాతో ఏమీ రాదు అన్నాడు. హోదా వల్ల ఏ రాష్టం బాగుపడలేదు అని చెప్పుకొచ్చాడు.. అంతటితో ఆగక హోదా అంటే జైలుకే అన్నాడు. ప్రత్యేకహోదా పోరాటంలో పాల్గొన్న అనేక మందిపై కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబుదే.

ఇప్పుడు కూడా అలాంటి వాళ్లు చాలా మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి నేఫథ్యంలో ఇప్పుడు చంద్రబాబుకు హోదా గుర్తుకు వచ్చింది. ఇన్ని రోజులూ కేంద్రం ప్రాపకం కోసం హోదా వద్దు అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హోదా కావాలని అంటున్నాడు. గతంలో హోదా వద్దు అని చెప్పిన మనిషి ఇప్పుడు హోదా కావాలని అంటున్నాడు.

ఇదంతా ఎన్నికల జిమ్మిక్ అని స్పష్టం అవుతోంది. మరి ఎన్నికలు అయిపోతే చంద్రబాబు రేపు మళ్లీ ఏ టర్న్ అయినా తీసుకుంటాడు. మళ్లీ హోదా వద్దు అని వాదించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలాంటి నేఫథ్యంలో చంద్రబాబు తీరుపై జనాల్లోనే నమ్మకం లేదు.

అయితే చలసాని శ్రీనివాస్ లాంటి వాళ్లు తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రజల సొమ్ముతో ఢిల్లీలో నిర్వహించిన దీక్షకు వెళ్లారు. వీళ్లంతా బాబు కోవర్టులు కాబట్టే ఇలా వ్యవహరిస్తూ ఉన్నారనే మాట వినిపిస్తోంది. కులాభిమానంతో వీరంతా బాబుకు వంత పాడుతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.