బ్రేకింగ్... ఇదే నెలలో రాజ్యసభ ఎన్నికలు

Mon Jun 01 2020 23:00:08 GMT+0530 (IST)

Breaking ... Rajya Sabha elections in the same month

ఒకవైపు దేశంలో రోజురోజుకు కేసులు భయానకంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న జరగాల్సిన ఈ ఎన్నికల్లో అప్పట్లో కరోనా కారణంగా వాయిదా వేశారు. ఆ ప్రక్రియను ఇపుడు కంప్లీట్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల కోసం కొత్త తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇదీ షెడ్యూలు

రాజ్యసభ స్థానాలు - మొత్తం 18
ఎన్నికల తేదీ - జూన్ 19
ఎన్నికల లెక్కింపు - జూన్ 19 సాయంత్రం 5 గంటలకు

వాస్తవానికి మార్చి 26న... ఖాళీ అయిన 55 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే... 37 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 18 స్థానాలకు మార్చి 26న ఎన్నికలు జరగాల్సి ఉండగా అవి వాయిదా పడ్డాయి.

గుజరాత్ ఏపీలో చెరో 4 స్థానాలకు రాజస్థాన్ మధ్య ప్రదేశ్ లలో చెరో మూడు స్థానాలకు... ఝార్కండ్ లో 2 స్థానాలకు మణిపూర్ మేఘాలయాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

ఏపీలో పోటీ చేస్తున్నదెవరు?

ఏపీలో 4 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. శాసన సభ్యులే ఓటర్లు. మెజారిటీ సీట్లు వైసీపీయే సహజంగా గెలవనుంది. వైసీపీ తరఫున రాజ్యసభకు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పరిమల్ నత్వానీ (అంబానీ మనిషి) పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం గెలిచే అవకాశం లేకపోయినా ఒక అభ్యర్థిని టీడీపీ పోటీలోకి దింపింది. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. టీడీపీ పోటీలో ఉండటం వల్ల ఏపీలో రాజ్యసభ సీట్లు ఏకగ్రీవం కాలేదు.