Begin typing your search above and press return to search.

రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. మనకెంతంటే.?

By:  Tupaki Desk   |   4 April 2020 9:10 AM GMT
రాష్ట్రాలకు కేంద్రం నిధులు విడుదల.. మనకెంతంటే.?
X
కరోనా కల్లోలం వేళ.. అందరూ లాక్ డౌన్ లో ఇళ్లలోనే ఉండిపోయారు. ప్రభుత్వాలకు పైసా పుట్టలేక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా కట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం ఊరట కల్పించింది. తాజాగా నిధులను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు విడుదల చేశారనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

దేశంలోని పలు రాష్ట్రాలతోపాటు ఏపీ - తెలంగాణకు కూడా నిధులు విడుదల చేశారు. ఏపీకీ మొత్తం రూ.1050.91 కోట్లు విడుదల కాగా.. ఇక తెలంగాణకు మాత్రం మరీ తీసికట్టుగా ‘రాష్ట్ర విపత్తు స్పందన నివారణ నిధి’ కింద కేవలం కేంద్రం వాటాగా రూ.225.50 కోట్లు మాత్రమే విడుదల కావడం గమనార్హం.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు ఈ నిధులు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తొలి విడత కేంద్రం వాటాను విడుదల చేశారు.

కేంద్రానికి వచ్చే ఆదాయంలో తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల లోటును భర్తీ చేసేందుకు కేంద్రం చేసే సహాయం కింద ఏపీకి భారీగా నిధులు విడుదల చేసింది. ఏపీకి రెవెన్యూ లోటు ఏకంగా 491.41 కోట్లు ఉండడంతో ఆ రాష్ట్రానికి మొత్తం రూ.1050.91 కోట్లను విడుదల చేసింది.

రెవెన్యూ లోటు భర్తీ కింద మొత్తం 14 రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చింది. మొత్తంగా రూ.17287 కోట్లను కరోనాపై ఫైట్ కోసం రాష్ట్రాలకు విడుదల చేసింది కేంద్రం.