Begin typing your search above and press return to search.

కరోనా మరింతగా విజృంభిస్తే ఆ 31 వేల మంది సాయం తీసుకోనున్నారట!

By:  Tupaki Desk   |   5 April 2020 12:30 AM GMT
కరోనా మరింతగా విజృంభిస్తే ఆ 31 వేల మంది సాయం తీసుకోనున్నారట!
X
దేశంలో కరోనా పాజిటివ్‌ ల సంఖ్య అంతకంతకు పెరిగి పోతుంది. మొన్నటి వరకు పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు పెరిగేవి. ఎప్పుడైతే నిజాముద్దీన్‌ జమాత్‌ మత ప్రార్థనలకు సంబంధించిన వారి కేసులు వెలుగులోకి వచ్చాయో అప్పటి నుండి పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోతుంది. రోజు రోజుకు వందల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ సంఖ్య త్వరలో వేలకు చేరినా ఆశ్చప్య పోనక్కర్లేదు అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో మొత్తం 3474 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ముందు ముందు మరింతగా కరోనా విజృంభిస్తే హాస్పిటల్స్‌ కరోనా వైరస్‌ భారిన పడ్డ వారిని చికిత్స చేసేందుకు సరిపడనంతగా అయిన సమయంలో ప్రత్యేక హోటల్‌ రూంలు ఇంకా రైల్వే బోగీలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. అదే సమయంలో వైధ్యుల కొరత కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రిటైర్డ్‌ డాక్టర్స్‌ 31 వేల మంది ఈ విపత్తు సమయంలో తమ సేవలను అందించేందుకు సిద్దంగా ఉన్నారట.

ఇప్పటికే వారితో ప్రభుత్వాలు చర్చలు జరిపాయని తెలుస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు వేలు దాటి లక్షల్లోకి వెళ్లిన సమయంలో వారి సేవలను వినియోగించుకోవాల్సి రావచ్చు అంటున్నారు. అక్కడ వరకు వెళ్లకుండా ఉండాలనే అంతా కోరుకుందాం. కాని ప్రభుత్వం మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రెడీగా ఉంది. ఇక మెడికల్‌ సిబ్బంది ఉద్యోగాలకు సెలవులు రద్దు చేశారు. ఒకవేళ సెలవులు పెట్టినా విధులకు హాజరు కాకున్నా కూడా ఎస్మా ప్రయోగించేందుకు కూడా ప్రభుత్వాలు సిద్దం అయ్యాయి.