Begin typing your search above and press return to search.

హోంశాఖ ఫేస్‌ బుక్ ‌లో బీర్ బాటిళ్లు - మిక్సర్ ఫోటో ..ఎవరు చేసారంటే!

By:  Tupaki Desk   |   28 May 2020 11:30 AM GMT
హోంశాఖ ఫేస్‌ బుక్ ‌లో బీర్ బాటిళ్లు - మిక్సర్ ఫోటో ..ఎవరు చేసారంటే!
X
కేంద్ర హోంశాఖ ఫేస్‌ బుక్ ‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. రెండు బీర్ బాటిళ్లు, మిక్సర్ తో ఉన్న ఫోటో కేంద్ర హోమ్ శాఖ పేస్ బుక్ పేజీ లో గురువారం పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న బెంగాల్‌ లో సహాయక చర్యలపై ఓ పోస్ట్‌ లో ఈ ఫోటో పెట్టారు. ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే రుజువు అని ఫేస్‌ బుక్ యూజర్ పోస్ట్ చేసారు. అయితే , దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారు.

ఈ పోస్ట్ చూసిన వెంటనే ఈ ఫోటోను తీసేయండి అని ఒకరు కామెంట్ పెడితే.... మరొకరు ఏందిది? దీనికి బాధ్యులెవరు? కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని పోస్ట్ చేశారు. అయితే , ఈ పోస్ట్ పై స్పందించిన కేంద్ర హోంశాఖ ... ఈ పేజీని ఓ జూనియర్ ఉద్యోగి చూస్తారని, ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు అని, పర్సనల్ ఫేస్ ‌బుక్ పేజీలో పోస్ట్ చేయబోయి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేజీలో పోస్ట్ చేసారని వివరణ ఇచ్చింది.

ఈ పోస్టును 9:32 నిమిషాలకు తొలగించామని, సదురు ఉద్యోగి క్షమాపణలు కూడా చెప్పారని, లిఖిత పూర్వకంగా రాసిచ్చారని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఈ పోస్టు హోంశాఖ వెబ్‌సైట్‌లో 15 నిమిషాలు పాటు ఉంది. అనుకోకుండా జరిగిపోయిన పొరపాటు అని, ఉద్యోగి నిజాయితీతోనే ఒప్పుకోవడంతో ఆ ఉద్యోగి పై హోంశాఖ సానుభూతితో ఉన్నట్టు తెలుస్తుంది.