'5జీ 'కే కేంద్రం మొగ్గు... 25 వేల కోట్లు కేటాయింపు

Wed Jun 09 2021 23:00:01 GMT+0530 (IST)

Central Cabinet Decisions

ప్రతి బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అవుతున్న విషయం తెలిసిందే. ఈరోజు కూడా భేటీ అయిన ప్రధాన మంత్రి మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొన్ని స్వీట్ నిర్ణయాలు తీసుకోగా.. మరికొన్ని హాట్ నిర్ణయాలు తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. అవేంటంటే..+ సెల్ ఫోన్లకు సంబంధించి 5జీ స్పెక్ట్రమ్‌పై వివాదం నడుస్తోంది. దీని వల్ల పక్షులు పిట్టలతోపాటు ప్రాణికోటికి కూడా తీవ్ర నష్టం ఉందని పర్యావరణ ప్రేమికులు తీవ్రస్థాయిలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో 5జీ స్పెక్ట్రమ్‌కు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది.

+ వచ్చే ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 5జీ సేవలను అమలు చేసేందుకు రూ.25 వేల కోట్లను కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పడం గమనార్హం.

+ ఖరీఫ్ కాలానికి సంబంధించిన పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నువ్వుల మద్దతు ధర క్వింటాల్‌కు 452 రూపాయలను పెంచారు. మినుములు క్వింటాలుకు 300 రూపాయలకు పెంచారు.

+ వరి మద్దతు ధర గతంలో 1868 రూపాయలుండగా ఈ ఖరీఫ్ కాలానికి గాను 1940 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక జొన్నలు ఇతర తృణధాన్యాల కనీస మద్దతు ధరను కూడా పెంచుతున్నారు.

+ రైల్వే సిగ్నల్స్ వ్యవస్థ ఆధునికీకరణ విషయంలో కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.  రైల్వేలకు 700 మెగాహెర్జ్ట్ బ్యాండ్ లో ఐదు మెగాహెర్జ్ట్ స్ప్రెక్టమ్‌ను అందిస్తారు. దీని ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ బాగుపడుతుందని కేంద్ర కేబినెట్ భావిస్తోంది.

+ ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో ఆప్టికల్ ఫైబర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దీనిస్థానంలో  స్ప్రెక్టమ్ వాడితే రేడియో కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుందనేది కేంద్రం చెబుతున్న మాట.