Begin typing your search above and press return to search.

భారతీయులు ఎదుర్కొనే ఆ దరిద్రాన్ని వెల్లడించిన షాక్ సర్వే రిపోర్టు

By:  Tupaki Desk   |   24 Nov 2021 4:15 AM GMT
భారతీయులు ఎదుర్కొనే ఆ దరిద్రాన్ని వెల్లడించిన షాక్ సర్వే రిపోర్టు
X
ఎవరు ఏ కులంలో పుట్టాలి? ఏ మతంలో పుట్టాలన్న చాయిస్ లేదు. యాక్సిడెంటల్ గా పుడతామంతే. ఇది సత్యం. మరి.. ఈ సత్యాన్ని గ్రహించి.. కులమతాలకు ఇవ్వాల్సిన పరిమిత ప్రాధాన్యతను మరిచి.. అంతకంతకూ ఎక్కువ చేసుకుంటున్న వైనం ఈ మధ్యన పెరుగుతోంది. భారత రాజకీయాల్లోనూ.. సామాజిక జీవితాల్లోనూ అత్యంత కీ రోల్ ప్లే చేసే కులాలు.. మతాలకు అతీతంగా కొన్ని రంగాలు పని చేస్తాయని భావిస్తాం.

అందుకు భిన్నంగా.. తాజాగా వెలువడిన ఒక సర్వే రిపోర్టును చూస్తే.. పవిత్రమైన వృత్తుల్లో పని చేసే వారికి ఈ పిచ్చ ఇంతలా ఉందా? అన్న భావన కలిగే సర్వే రిపోర్టు ఒకటి వెల్లడైంది. ఇందులో పేర్కొన్న అంశాలు షాకింగ్ గా మారాయి. ఇంతకీ సర్వే చేసిన సంస్థ ఏది? ఏ అంశం మీద సర్వే చేశారు? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అన్న వివరాల్ని చూస్తే..

భారత ఆరోగ్య రంగంలో కులం.. మతం లాంటి వివక్ష ఎక్కవన్న విషయంతో పాటు.. ప్రతి నలుగురిలో ఒకరు ఆరోగ్య రంగం నిపుణుల చేత కులం కారణంగా కానీ మతం కారణంగా కానీ వివక్షను ఎదుర్కొంటున్న షాకింగ్ నిజాన్ని వెల్లడించింది.

భారత్ లో రోగుల హక్కుల పరిరక్షణ పేరుతో ఆక్స్ ఫామ్ ఇండియా అనే ఎన్జీవో దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి - ఏప్రిల్ మధ్య 3890 మంది నుంచి రోగుల హక్కులకు సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని సంధించటం ద్వారా సదరు సంస్థ ఈ అభిప్రాయాల్ని సేకరించింది.

ఆసుపత్రుల్లో కానీ ఆరోగ్య రంగ నిపుణుల చేతుల్లో కులం లేదంటే మతం కారణంగా వివక్షను ఎదుర్కొంటున్న విషయాన్ని సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతు ముస్లింలు.. 20 శాతం మందికి పైగా దళితులు.. ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. గడిచిన పదేళ్లలో తమ సమీప బంధువులు ఆసుపత్రుల్లో చేరినప్పుడు చికిత్సను ప్రారంభించటానికి ముందు అంచనా వ్యయం వివరాల్ని ఆసుపత్రులు చెప్పలేదన్న విసయాన్ని సర్వేలో పాల్గొన్న వారిలో 50 శాతం మంది పేర్కొన్నట్లుగా తేలింది.

అంతేకాదు.. తాము కోరినప్పుడు పేషెంట్ కేస్ పేపర్లు.. రోగి రికార్డులు.. వివిధ పరీక్షల ఫలితాల్ని ఎప్పుడూ ఇవ్వలేదని 31 శాతం మంది చెప్పారు. అంతేకాదు.. మహిళలకు ఫిజికల్ టెస్టులు చేసే సమయంలో కచ్ఛితంగా వారి వెంట మహిళా అటెండెంట్ ఉండాలి.

కానీ.. అందుకు భిన్నంగా పురుష అటెండెంట్ తమను భౌతిక పరీక్షల్ని చేసినట్లుగా 35 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. అంతేకాదు.. రోగికి ఎదురైన అనారోగ్యం.. దానికి కారణాలు ఏమిటన్న విషయాన్ని చెప్పకుండానే వైద్యులు మందులు రాయటం.. టెస్టులు చేయించుకు రావాలని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది తమకు ఎదురైన చేదు అనుభవనాన్ని వెల్లడించారు.