Begin typing your search above and press return to search.

ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై భారీగా జీఎస్టీ వ‌డ్డించ‌నున్నారా?

By:  Tupaki Desk   |   27 Jun 2022 12:30 PM GMT
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై భారీగా జీఎస్టీ వ‌డ్డించ‌నున్నారా?
X
ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై భారీగా జీఎస్టీని వ‌డ్డించ‌నున్నారా అంటే అవున‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వీటిపై 18 శాతం జీఎస్టీ ఉండ‌గా దీన్ని 28 శాతం చేస్తార‌ని వ్యాపార వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ మేర‌కు మేఘాల‌య ముఖ్య‌మంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని బృందం నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు.

ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాలపై జీఎస్టీని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ఇప్ప‌టికే చేసిన‌ ప్రతిపాదనను జూన్ 28-29 తేదీల్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం.. గేమ్‌లో పాల్గొనడానికి ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుముతో సహా, ఆన్‌లైన్ గేమింగ్ పూర్తి విలువతో పన్ను విధించాలని సిఫార్సు చేసింది. అలాగే క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని సూచనలు చేసింది. ఈ నెల 28-29 తేదీల్లో చండీగఢ్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

క్యాసినోలు, రేస్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సేవల విలువను అంచనా వేయడంతో పాటు వాటి నిర్దిష్ట లావాదేవీలపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించేందుకు గతేడాది జూన్‌లో రాష్ట్రాల‌ ఆర్థిక మంత్రుల‌తో కమిటీ ఏర్పాటైంది.

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలోని ఈ కమిటీ మే నెల మొదటి వారంలో సమావేశమైంది. క్యాసినోలు, రేస్‌కోర్సులు, ఆన్‌లైన్‌ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్‌టీ విధించాలని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. మే నెల‌లోనే మ‌రోసారి మంత్రుల కమిటీ సమావేశమై జీఎస్టీ పెంపుపై తుది నివేదికను రూపొందించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నివేదిక‌ను అంద‌జేసింది.

జూన్ 28-29 తేదీల్లో జ‌రిగే స‌మావేశాల్లో మంత్రుల క‌మిటీ చేసిన‌ ప్రతిపాదనలకు జీఎస్టీ మండలి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, గుర్ర‌పు పందాలు, అలాగే, కాసినోలలోకి ప్రవేశ రుసుములపై ​​28 శాతం జీఎస్టీ పన్ను విధించాలని మంత్రుల క‌మిటీ సూచించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తప్పనిసరిగా ఆహారాలు/పానీయాలు మొదలైనవాటిని కూడా చేర్చాలని సూచించింది. ఈ నేప‌థ్యంలో ఆన్లైన్ గేమ్స్, క్యాసినోలు, గుర్ర‌పు పందాల‌కు సంబంధించి ప్రవేశ రుసుం నుంచి అన్నింటిపైనా 28 శాతం జీఎస్టీ విధించనున్నట్టు స‌మాచారం.