మహారాష్ట్రలో విలయం..50వేలు దాటిన కేసులు

Mon May 25 2020 13:15:16 GMT+0530 (IST)

Cases that crossed the 50thousand mark in Maharashtra

దేశంలో మహమ్మారి విస్తృతి ఏమాత్రం తగ్గడం లేదు. అందులో సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదుకావడం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.మహారాష్ట్రలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది.దేశంలోనే అత్యధిక పాజిటివ్ కేసులు.. మరణాలు మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఆదివారం కొత్తగా 3041 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 58మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తంగా మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 50231కి చేరింది. అందులో 33988 యాక్టివ్ కేసులు ఉండగా.. 14600 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 1635మంది మృతి చెందారు.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా 28817 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 949మంది వైరస్ తో చనిపోయారు.

థానేలో 6130 పూణే 5347 కేసులతో పరిస్థితి తీవ్రంగా ఉంది. ముంబై తర్వాత పూణేలో అత్యధిక మరణాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు 1.38 లక్షలకు చేరుకున్నాయి. 4021 మంది ఇప్పటివరకు చనిపోయారు.