బాలకృష్ణపై కేసులు నమోదుకు రంగం సిద్ధం?

Mon Oct 14 2019 13:27:53 GMT+0530 (IST)

తెలుగుదేశం పార్టీ నేత - సినిమా హీరో బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. తాజాగా నెట్లో ఒక జోక్ వైరల్ అవుతూ ఉంది. ఒక ఫొటోలో చిరంజీవి - బాలకృష్ణ  ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని ఆధారంగా చేసుకుని ఒక జోక్ వైరల్ అవుతోంది.అదేమిటంటే.. అందులో చిరంజీవి ‘మనం ఇంత ఫ్రెండ్లీగా ఉంటాం. మన అభిమానులు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు..మన పేర్లు చెప్పుకుంటూ..’ అని చిరంజీవి అన్నట్టుగా ఒక క్యాప్షన్ పెట్టారు. చిరంజీవి మాటలకు బాలయ్య బదులిస్తూ..’అందుకే ఫ్యాన్స్ దగ్గరకు వచ్చినప్పుడు నేను వారిని కొడుతుంటా..’ అని రిప్లై ఇచ్చినట్టుగా మరో క్యాప్షన్ ఉంటుంది. ఈ ఫొటో వైరల్ గా మారింది.

అది జోకే అయినా ఇప్పుడు ఆ తీరే చంద్రబాబు వియ్యంకుడిపై కేసులకు కారణం అవుతోందని సమాచారం. బాలకృష్ణ చేతిలో దెబ్బలు తిన్న వారంతా ఇప్పుడు వెళ్లి కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారట. తమ మీద బాలకృష్ణ చేయి చేసుకున్నారంటూ వారు ఫిర్యాదులు చేయబోతున్నట్టుగా సమాచారం.

బాలయ్య చేతివాటాన్ని చాలా మందే రుచి చూసి ఉంటారు. ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు కూడా బాలకృష్ణ బాధితుల సంఖ్య పెరిగింది. ప్రచార సమయంలో బాలకృష్ణ ఒక మీడియా వర్గం వాళ్లపై కూడా దురుసు గా ప్రవర్తించాడు. వారి పై చేయి చేసుకున్నాడు.

ఎన్నికల ప్రచారానికి వెళ్లి అలా కొట్టడం బాలకృష్ణకే సాధ్యం అయ్యింది. ఇలాంటి నేఫథ్యంలో బాలకృష్ణపై అలాంటి బాధితులంతా ఫిర్యాదులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అలాంటి ఫిర్యాదులు నమోదు అయితే కేసులు పెట్టడం గ్యారెంటీ అని పరిశీలకులు అంటున్నారు.