ఎంపీ అరవింద్ పై కేసు నమోదు..ఇదే కారణం !

Wed Nov 25 2020 23:20:57 GMT+0530 (IST)

Case registered against MP Arvind

తెలంగాణ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతుంది. అయితే ప్రత్యర్థులపై ఒకరి మీద మరొకరు విమర్శలుచేసుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే   బీజేపీకి  నేత ఎంపీ అరవింద్ పై కేసు నమోదు అయింది. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ సమీపంలో తెరాస నేతలకు సంబంధించిన ఫ్లెక్సీ లను చించివేసిన ఘటన విషయంలో ఎంపీ అరవింద్ పై సెక్షన్ 504506 427 కింద బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తెరాస లీగల్ సెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీపై మరియు కార్యకర్తలపై కేసు నమోదు అయింది.అయితే నిన్న ప్రచారం లో బాగంగా ఎంపీ అరవింద్ అధికార పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టిఆర్ ఎస్ ఈ ఎన్నికలతో మూత పడిపోవడం ఖాయం అని అన్నారు. కరీంనగర్ నిజామాబాద్ దుబ్బాక ఎన్నికల్లో ఎలా అయితే నిజాయితీగా ఓటు వేశారోఅలానే ఈ జిహెచ్ ఎంసి ఎన్నికల్లో కూడా ఓటు వేయాలి అని  కోరారు. బీజేపీకి ఓటు వేసి మార్పుకి నాంది పలకాలి అంటూ ప్రజలను కోరారు.

ఇదిలా ఉంటే ... గత కొన్ని రోజుల క్రితం ఎంపీ అరవింద్ఒ క మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఇష్టానుసారంగా ఏజన్సీలకు రాత్రికి రాత్రే హోర్డింగ్‌లు పెట్టేందుకు ఆర్డర్ లు ఇచ్చారని టెండర్లు పిలవకుండా ఏజెన్సీలకు ఏ విధంగా ఇస్తారని మంత్రి ని  ప్రశ్నించారు. స్తంభాలు రోడ్లపై ఉన్న టాయిలెట్ల మీద పెట్టుకున్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలను కార్యకర్తలు ఎక్కడికక్కడ చించేయాలని అరవింద్ పిలుపునిచ్చారు.