Begin typing your search above and press return to search.

మీసం మెలేశారంటూ జేసీ పై కేసు నమోదు .. అసలేమైందంటే ?

By:  Tupaki Desk   |   31 July 2021 11:40 AM GMT
మీసం మెలేశారంటూ జేసీ పై కేసు నమోదు .. అసలేమైందంటే ?
X
టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కి ఈ మధ్య కాలం అంతగా కలిసి రావడం లేదు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎన్నిక ఏదైనా, ప్రత్యక్ష ఎన్నికైనా,పరోక్ష ఎన్నికైనా, వైసీపీ దే గెలుపు. ఇక రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ప్రతిపక్ష నేతలు రోడ్డుపైకి రావాలి అంటేనే భయపడేలా చేస్త్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ దెబ్బకి ఇతర పార్టీ నేతలు కామ్ అయిపోయారు. కానీ , జేసీ బ్రదర్స్ మాత్రం వైసీపీ ఎదురొడ్డి నిలబడుతున్నారు. మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగిరినా, తాడిపాత్రలో మాత్రమే టీడీపీ గెలుపొందింది. అది కూడా కేవలం జేసీ బ్రాండ్ పైనే ,అది పోతే పోయింది.

రెండో డిప్యూటీ చైర్మన్ పదవినైనా దక్కించుకోవాలని వైసీపీ భావించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎక్స్ అఫిషియో సభ్యులతో పదవి చేపట్టొచ్చని,ఒకరిద్గరు టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యేట్టు చూస్తే గెలుపు సులువే అని వ్యూహాలు రచించారు అంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఆ వ్యూహాన్నిముందుగానే పసిగట్టిన జేసీ దివాకర్ రెడ్డి అలర్ట్ అయ్యారు. చివరికి ఆయన కౌన్సిల్ హాల్ కు వెళ్లకుండానే టీడీపీ నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించేలా చేశారు. దీంతో జేసీ బ్రదర్స్ ను ఎలా ఢీ కొట్టాలా అని వైసీపీ నేతలు మధనపడుతూనే ఉన్నారు.

అయితే, సొంత నియోజకవర్గం లో ప్రాబల్యం చాటుతున్నప్పటికీ , మరోవైపు కేసులు మాత్రం జేసీ దివాకర్ రెడ్డిని వీడడం లేదు. ఒక కేసుపై జైలుకు వెళ్లి.. బెయిల్ పై వస్తే, మరో కేసు వేస్తున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడిపత్రి మున్సిపల్ వైస్ ఛైర్మన్‌ ఎన్నికల సందర్భంగా మీసం మెలేసీ మరి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయనపై 153ఏ, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఎన్నికను వైసీపీ కౌన్సిలర్లు బహిష్కరించారు. పట్టణంలో అక్రమ భవనాల కూల్చివేతను అడ్డుకోవడంతో పాటు భూ కబ్జాదారులకు మద్దతిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ రెండో వైస్ ఛైర్మన్ పదవిని కూడా దక్కించుకున్నారు. ఈ పదవి కోసం వైసీపీ ప్రయత్నించినా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాలతో సాధ్యం కాలేదు.. కౌన్సిల్‌ హాల్‌ కు వెళ్లకుండానే చక్రం తిప్పారు. అనూహ్యంగా వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు వైసీపీ గైర్హాజరు కావడంతో నాలుగో వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ రహీమ్‌ కు పదవి దక్కింది. అధికార పక్షం గైర్హాజరు కావడం విచిత్రంగా ఉందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన మీసం మెలేశారు. దీనితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు.