ఆటోపైలట్ మోడ్ లో కారు .. చెట్టుకి ఢీ ఇద్దరు మృతి !

Tue Apr 20 2021 11:00:22 GMT+0530 (IST)

Car in autopilot mode .. crashes into a tree, two killed!

టెస్లా కారు .. సెల్ఫ్ డ్రైవింగ్ (డ్రైవర్ రహిత) సదుపాయం కలిగి ఉంది. ఈ డ్రైవర్ రహిత కారు తాజాగా ఘోర ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద అతివేగంగా వచ్చి ఎదురుగా చెట్టును ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. న్యూయార్క్‌లోని టెక్సాస్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు కారులోనే సజీవదహనమయ్యారు.  సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ సీటులో ఎవరూ లేరని తెలిపారు. డ్రైవర్ పక్క సీటులో వెనుక సీటులో కూర్చొన్న ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించారు.ఈ కారు ఆటోపైలట్ మోడ్‌లో వేగంగా ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కారులో ఉన్న డ్రైవర్ సహాయక వ్యవస్థ సరిగ్గా పనిచేయక ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్లా కంపెనీ తన వెబ్ సెట్ లో ఒక ప్రకటనను విడుదల చేసింది. తమ వాహనాలు పూర్తిగా ఆటోపైలట్ కాదని డ్రైవర్ పరవేక్షణ కచ్చితంగా ఉండాలని కంపెనీ తెలిపింది. కాగా టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు  తరుచుగా ప్రమాదానికి గురవుతున్న సంగతి తెలిసిందే. సదరు కారు వేగంగా ప్రయాణిస్తూ మలుపు తిరగడంలో విఫలమైందని ఆపై చెట్టుకు ఢీకొని తగలబడిపోయి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు.