Begin typing your search above and press return to search.

‘దొందూ దొందే’ మాటకు బ్రాండ్ అంబాసిడర్లను ఈ వీడియోలో కనిపిస్తారు

By:  Tupaki Desk   |   14 April 2021 11:30 PM GMT
‘దొందూ దొందే’ మాటకు బ్రాండ్ అంబాసిడర్లను ఈ వీడియోలో కనిపిస్తారు
X
దొందూ దొందే అన్న మాట తరచూ వింటుంటాం. కానీ.. అలాంటోళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. ఈ వీడియో చూస్తే మాత్రం.. ఇంతకు మించిన పర్ ఫెక్టు ‘దొందు దొందూ’ మళ్లీ చూడలేమన్నట్లుగా ఉండే వీడియో ఇది. ఒక మహిళ తన కారును రెండు కార్ల మధ్య పార్కు చేసేందుకు పడే కష్టం అంతా ఇంతా కాదు. చాలామంది మహిళలకు కార్లను నడపటం పెద్ద కష్టం కాదు కానీ.. దాన్ని సరైన పద్దతిలో పార్కు చేసేందుకు విపరీతంగా కష్టపడుతుంటారు. ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంటారు.

తాజా వీడియోలో కూడా అలాంటి సీనే కనిపిస్తుంది. రెండు కార్ల మధ్యన తన కారును పార్కు చేసేందుకు విపరీతంగా శ్రమిస్తుంది. ఎంత అంటే.. దాదాపు గంట పాటు.. తన కారును పార్కు చేసేందుకు అవస్థలు పడింది. మధ్యలో కారు దిగి.. పార్కింగ్ ప్లేస్ ను అడుగుల రూపంలో కొలిచి.. మరీ పార్కు చేసేందుకు ప్రయత్నించినా కుదర్లేదు. అలాంటి సమయంలో ఒక మహిళ వచ్చి.. కారును సరిగా పార్కు చేసేందుకు సాయం చేస్తుంది.

ఎట్టకేలకు.. కారును పార్కు చేయటం.. ఆమెకు సాయం చేసిన మహిళ బై చెప్పేస్తుంది. ఇక్కడో అనూహ్యమైన ట్విస్టు. అదేమంటే.. పార్కు చేసిన మహిళ కారు వెనుక ఉన్న కారు ఎవరిదో కాదు.. పార్కింగ్ చేసేటప్పుడు సాయం చేసిందే ఆవిడదే. కారును కష్టపడి పార్కు చేసినంతనే.. వెనుక కారు ఆమె.. కారు తీసుకొని వెళ్లిపోవటం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

పార్కింగ్ కోసం కష్టపడుతున్నప్పుడు.. తన కారును కాస్త వెనక్కి పెడితే.. మరింత ఈజీగా పార్కు చేసే వీలుంటుంది కదా. కానీ.. అలా చేయకుండాఆమె చేత అతి కష్టమ్మీదా కారును పార్కు చేయించి.. తన దారిన తాను కారులో వెళ్లిపోయిన వైనం చూస్తే.. నవ్వు ఆగదంతే.. వైరల్ గా మారిన ఈ వీడియోను చూసి.. హాయిగా నవ్వేయండి.