పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? పాల్గొనకూడదా?

Sat May 30 2020 05:00:03 GMT+0530 (IST)

Can you do romance during Periods?

పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? లేదా అన్నది ఇప్పటికీ చాలా మందిలో సందేహాలకు కారణమవుతోంది. దీనిపై తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దాదాపు 500 మంది అభిప్రాయాలు తీసుకుంటే అందులో 55శాతం మంది నెలసరి సమయంలో శృంగారంలో సౌకర్యవంతంగానే ఉన్నామని చెప్పారు. పీరియడ్స్ సమయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొలేదని అన్నారు. మరో 45శాతం మంది ఆ సమయంలో సెక్స్ ఫర్వాలేదని చెప్పడం విశేషం.ఈ పరిశోధనలో 45శాతం మంది మహిళలు పీరియడ్ సమయంలో శృంగారం కోసం మరింతగా తపిస్తారట.. సెక్స్ లో పాల్గొన్నప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీన్నే బాండింగ్ హార్మోన్ అంటారు. ప్రసవ సమయంలో ఈ హార్మోన్లు పురిటినొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో హార్మోన్లు సహాయపడుతాయి. ఉద్వేగం పొందితే హార్మోన్ల ఉత్పత్తి పెరిగి మీ శరీరం మరింత ఆహ్లాదాన్ని పొందుతుంది. నొప్పులు తిమ్మిర్ల బాధను అవి తొలగిస్తాయని కాలిఫోర్నియా యూనివర్సి గైనకాలజిస్ట్ రాచెల్ న్యూమెన్ తెలిపారు.

నెలసరి సమయంలో భావప్రాప్తి కలిగినప్పుడు గర్భాశయ సంకోచాలు మరింత ధృఢమవుతాయని.. ఆ సమయంలో కలిసినప్పుడు పీరియడ్స్ వల్లే వచ్చే ఇబ్బందులు కూడా తక్కువగా అనిపిస్తాయని గైనకాలజిస్ట్ రాచెల్ వివరించారు. నెలసరి సమయంలో సెక్స్ చేయడం తప్పు కాదని.. నిరభ్యంతరంగా పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.

TAGS: