కరోనా వ్యాక్సిన్ ఏ చేతికైనా వేసుకోవచ్ఛా ? లేదా ?

Wed Apr 21 2021 05:00:01 GMT+0530 (IST)

Can corona vaccine be given to any hand? Or not?

దేశంలో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నా కూడా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనితో వ్యాక్సినేషన్ కార్యక్రమం పై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. అయితే కరోనా వ్యాక్సిన్ పై ప్రజలకు ఇప్పటికి కూడా పలు రకాల సందేహాలున్నాయి. ఏ చేతికి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇతర వ్యాధులకు మందులు వాడుతున్నవారు గర్భవతులు వ్యాక్సిన్ వేయించుకోవచ్చా డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి ఇలాంటి అనేక సందేహాలను  నిమ్స్ లో ఫార్మకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి నివృత్తి చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే ...ముందుగా వ్యాక్సిన్ ఎలాంటి వారు తీసుకోకూడదు అంటే .. ఇమ్యునోసప్రెసెంట్స్ స్టెరాయిడ్స్ హెచ్ ఐవీకి మందులు వాడుతున్నవారు కరోనా వ్యాక్సిన్ వేయించుకోకూడదు. స్టెరాయిడ్స్ లో చాలా రకాలు  ఉన్నాయి. వీటిలో నోటి ద్వారా ఇంజెక్షన్‌ల ద్వారా ఇచ్చే స్టెరాయిడ్స్  వాడుతున్నవారు టీకాకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ వేయించుకున్నా ఉపయోగం ఉండదు. వారిలో యాంటీబాడీస్ అభివృద్ధి కావు.  ఈ కరోనా టీకా తీసుకునే ముందు కరోనా టెస్ట్ చేపించుకోవాలా అంటే అయన అవసరం లేదు అని చెప్తున్నారు.  వైరస్ లక్షణాలు లేన్నప్పుడు ఇంటిలో ఎవరూ పాజిటివ్ కానప్పుడు నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. నిర్భయంగా టీకా వేసుకోవచ్చుట. వ్యాక్సినేషన్ తర్వాత పరీక్ష చేయిస్తే పాజిటివ్ వస్తుందా? వారిలో వైరస్ లక్షణాలు ఉంటాయా? అంటే .. అది కేవలం అపోహ మాత్రమే. అలా అయితే అందరికీ వైరస్ సోకే ముప్పు ఉంటుంది కదా టీకా వేసుకోవడానికి ముందుగానీ తర్వాతగానీ శరీరంలోకి వైరస్ ప్రవేశిస్తే పాజిటివ్ గా తేలుతుంది. వ్యాక్సినేషన్ వల్ల పాజిటివ్ రాదు. ఇతరుల ద్వారా వైరస్ సోకితేనే వస్తుంది. కరోనా వచ్చినవారు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమి కాదు .. ఎలాంటి అపాయం లేదు.

ఇక వ్యాక్సినేషన్ ఏ చేతికి వేసుకోవాలి అంటే .. సాధారణంగా టీకాలు ఎక్కువగా ఎడమ చేతికి వేస్తారు. కుడి చేతికి వేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నిర్భయంగా ఏ చేతిపైనైనా కూడా ఈ వ్యాక్సిన్ వేపించుకోవచ్చు. రక్తం పల్చగా అవడానికి మందులు వాడేవారు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా  వారికి ఎలాంటి ముప్పు ఉండదు. క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయం పరిశీలించాం అని ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని అన్నారు. అలాగే  నిర్ణయించిన గడువు దాటిన తర్వాత వారం పది రోజుల్లోపు రెండో డోసు వేసుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. వారంలోగా వేసుకోవడానికి ప్రయత్నించాలి. మొదటి డోసులో ఒక కంపెనీకి చెందిన వ్యాక్సిన్ రెండో డోసులో అది దొరక్కపోతే వేరే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ వేసుకోవచ్చా అంటే .. రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకోవద్దని అన్నారు. అలాగే మొదటి డోసుగా వేసుకున్న వ్యాక్సిన్‌నే మళ్లీ రెండో డోసుగా వేసుకోవాలని తెలిపారు. టీకాకు ముందు తర్వాత కనీసం రెండు మూడు రోజులు మద్యం ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రస్తుతం 45 ఏళ్లు దాటినవారికి టీకా వేస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవచ్చు. గర్భవతులకు టీకాలు నిషిద్ధం. మానసిక వ్యాధిగ్రస్తులకు టీకా వేయించకపోవడం మంచిది. జ్వరం తగ్గాక రెండు మూడు రోజులు ఆగి వేసుకోవాలి. ఒకటి రెండు రోజులు వ్యాక్సిన్ ఆలస్యమైనా ఏమీ కాదు. కరోనా వచ్చి తగ్గిపోయినవారు ఒక నెల తర్వాత  ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు