Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ తో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? వీర్యకణాలు తగ్గుతాయా?

By:  Tupaki Desk   |   19 Jun 2021 5:30 PM GMT
కరోనా వ్యాక్సిన్ తో సెక్స్ సామర్థ్యం తగ్గుతుందా? వీర్యకణాలు తగ్గుతాయా?
X
దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరుగుతున్న వేళ ఎన్నో అనుమానాలు.. అపోహలు రాజ్యమేలుతున్నాయి. కరోనా విలయాన్ని అడ్డుకునేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ కావడంతో ఇప్పుడు మెజార్టీ శాస్త్రవేత్తలు ప్రజలంతా వేసుకోవాలని..ఇది సురక్షితం అని చెబుతున్నారు. ప్రభుత్వాలు వేసుకోవాలని సూచిస్తున్నాయి.అయినా కూడా టీకాలపై నెలకొన్న సందేహాలు తీరడం లేదు.

కోవిడ్ వల్ల పురుషుల్లో సెక్స్ సామర్థ్యం క్రమంగా తగ్గిపోయి వ్యంధత్వానికి దారితీస్తుందని.. సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషించే వీర్యకణాల సంఖ్య తగ్గుతుందనే అనుమానాలు ఉన్నాయి. వ్యాక్సిన్లపై వింత భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎన్నో ప్రశ్నలకు తాజాగా అధ్యయనం క్లారిటీ ఇచ్చింది.

కరోనాకు పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా ఈ ప్రచారం సాగింది. కోవిడ్ సోకితే లైంగిక సామర్థ్యం తగ్గుతుందని.. వ్యంధత్వం వస్తుందని గత ఏడాది నవంబర్ లో చైనా శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.కోవిడ్ వచ్చి కోలుకున్న వారిలో 39శాతం మందిలో శుక్రకణాల సంఖ్య తగ్గినట్టుగా అంచనావేశారు. 61శాతం మందిలో వీర్యకణాల్లో తెల్లరక్తకణాల సంఖ్య పెరిగినట్లు గుర్తించారు.

లైంగిక పటుత్వంపై చైనీస్ శాస్త్రవేత్తల స్టడీ ప్రభావం తర్వాతి కాలంలో వ్యాక్సిన్లపై పడింది. చైనా పరిశోధన అమెరికా దేశంలోని ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించింది. లైంగిక సామర్థ్యం తగ్గుతుందని.. స్పెర్మ్ కౌంట్ కూడా పడిపోతుందన్న భయం అమెరికన్లను వెంటాడి వారు వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందు కు రాలేదు. దీంతో అమెరికా ప్రభుత్వం ఎంత ప్రోత్సహిస్తున్నా అక్కడి జనాలు మాత్రం వ్యాక్సిన్ తీసుకోవడం లేదు.

దీంతో తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత మియామీ వర్సిటీ కీలక అధ్యయనం చేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గడం కానీ.. వీర్యకణాల సంఖ్య తగ్గడం కానీ జరగలేదని తాజా అధ్యయనంలో తేల్చింది. రెండుడోసులు తీసుకున్న వారిలో లైంగిక పరమైన దుష్ప్రభావాలేవీ కనిపించలేదని మోత్తం 45 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశామని తెలిపింది. లైంగిక సామర్థ్యాన్ని వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు.. తర్వాత పరీక్షించి నిర్ధారణ చేశామని మియామీ వర్సిటీ తెలిపింది.

దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే లైంగిక సామర్థ్యం తగ్గడం కానీ.. వీర్యకణాల సంఖ్య తగ్గడం కానీ జరగదని తేటతెల్లమైంది. ప్రజల్లో ఉన్న ఈ అపోహలు తొలిగిపోయినట్టైంది.