పాపం.. అమెరికాలో ఉన్న బతికేది

Fri Jun 18 2021 07:26:51 GMT+0530 (IST)

Came from America and lost his life

కరోనా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. అంతులేని ఆవేదనను కలిగిస్తోంది. ఒకరు ఇద్దరూ కాదు చాలా మంది కరోనాతో చనిపోతున్నారు. ఇందులో యువత కూడా ఉండడం పెను విషాదానికి కారణమవుతోంది.అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి కరోనాతో చనిపోవడం విషాదం నింపింది. తల్లిదండ్రులను చూసేందుకు వచ్చి చనిపోయిన నర్మిషారెడ్డి కరోనాకాటుకు బలైంది.తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన నరిష్మా రెడ్డి అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి నాలుగేళ్లుగా అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా చేస్తోంది. ఈమె తండ్రి రామగుండం కృష్ణానగర్ లో కాంట్రాక్టర్.

నరిష్మాకు పెళ్లి సంబంధాలు చూడటానికి తల్లిదండ్రులు రామగుండంకు పిలిపించారు. నెల క్రితం ఈమె అమెరికా నుంచి సొంతూరుకు వచ్చింది. 20 రోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఆమెతోపాటు తల్లికి పాజిటివ్ రాగా.. ఇద్దరూ హోంఐసోలేషన్ లో ఉన్నారు.

వారం కిందట టెస్ట్ చేస్తే నరిష్మారెడ్డికి నెగెటివ్ వచ్చింది. అయినా ఆరోగ్యం మాత్రం కుదటపడలేదు. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆష్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం రాత్రి చనిపోయింది.మంచి ఉద్యోగంతో అమెరికాలో క్షేమంగా ఉన్న కూతురును అనవసరంగా రప్పించి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల రోదన మామూలుగా లేదు.