Begin typing your search above and press return to search.

ఎయిర్ హోస్టెస్ లకు లోదుస్తులు తప్పనిసరి: క్లారిటీ ఇచ్చిన పాక్ ఎయిర్ లైన్స్

By:  Tupaki Desk   |   1 Oct 2022 10:33 AM GMT
ఎయిర్ హోస్టెస్ లకు లోదుస్తులు తప్పనిసరి: క్లారిటీ ఇచ్చిన పాక్ ఎయిర్ లైన్స్
X
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) తన క్యాబిన్ సిబ్బందికి లోదుస్తులు (డాయర్లు, ఇన్నర్ వేర్లు) ధరించాలని.. సరైన దుస్తులు ధరించాలని కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. పిఐఎ జనరల్ మేనేజర్ అమీర్ బషీర్ ఎయిర్ హోస్టెస్‌ల డ్రెస్సింగ్‌ను విమర్శించారు.. దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే ఇది పెనుదుమారం రేపింది. చాలా మంది ఈ చర్యపై దుమ్మెత్తిపోయడంతో ఎట్టకేలకు పీఐఏ స్పందించింది. వివరణ ఇచ్చింది.

ఎయిర్ హోస్టెస్ సహా క్యాబిన్ సిబ్బంది లోదుస్తులు ధరించాలన్న అనాలోచిత నిర్ణయంపై పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది. అమలు చేసిన 24 గంటల్లోపే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఎయిర్ లైన్స్ సిబ్బంది సరైన వస్త్రధారణతో విధులకు హాజరు కావాలని చెప్పడమే తమ ఉద్దేశమని భావాన్ని వ్యక్తపరచడంలో ఎయిర్ లైన్స్ అధికారులు విఫలమయ్యారని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ అధికారి వివరణ ఇచ్చారు. సిబ్బంది మనసుల్ని నొప్పించినందుకు క్షమించాలని కోరారు. సంస్థ పరువుకు భంగం వాటిల్లేలా కొందరు దురదృష్టవశాత్తూ ఈ అంశాన్ని ట్రోల్చేయడం బాధాకరం అని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు రోజు ఈ వివాదాస్పద నిర్ణయాన్ని పీఐఏ అమలు చేసింది. పీఐఏ ప్రకారం క్యాబిన్ సిబ్బంది వేషధారణతో ఎయిర్‌లైన్స్ పై ప్రతికూల ప్రభావం పడుతోందని.. కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు మరియు వివిధ రకాల సందర్శనల సమయంలో సాధారణ దుస్తులు ధరించడం చాలా ఆందోళనతో కలిగిస్తోందని.. అలాంటి డ్రెస్సింగ్ వీక్షకుడిపై పేలవమైన అభిప్రాయాన్ని కలిగిస్తుందని లోదుస్తులు కంపల్సరీ చేసింది.

వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ పై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని.. సంస్థకు వీరి డ్రెస్సులతో నష్టం కలుగుతోంది." అని పిఐఎ జనరల్ మేనేజర్ (ఫ్లైట్ సర్వీసెస్) అమీర్ బషీర్ నిన్న పంపిన అంతర్గత సూచన మెమోలో ఆదేశించినట్టు తెలిసింది.

పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించబడుతున్న పీఐఏ ఈ కొత్త నోటిఫికేషన్‌కు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని దాని సిబ్బందిని కోరింది. బషీర్ ఎయిర్‌లైన్ సిబ్బందిని ఫార్మల్ సాదా దుస్తులు ధరించి "సరైన లోదుస్తులు" లోపల ధరించాలని ఆదేశించారు.. మగ, ఆడవారు ధరించే దుస్తులు మన పాకిస్తానీ జాతీయ మరియు సాంస్కృతిక నైతికతకు అనుగుణంగా ఉండాలని ఆయన అన్నారు. గ్రూమింగ్ ఆఫీసర్లు క్యాబిన్ సిబ్బందిని ఎల్లప్పుడూ"పర్యవేక్షించవలసిందిగా కోరారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఆదేశించారు. ప్రయాణికులను రెచ్చగొట్టకుండా కురుచ దుస్తులు ధరించకుండా విమానంలో అనైతికతకు తావు ఇవ్వకూడదనే ఇలా ఫార్మల్ డ్రెస్సులు వేసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు.

ఇప్పుడు అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో దెబ్బకు పీఐఏ దీనిపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.