Begin typing your search above and press return to search.

కేసీఆర్ తెరవెనుక శక్తితో ఇబ్బందులు?

By:  Tupaki Desk   |   10 Dec 2019 2:30 PM GMT
కేసీఆర్ తెరవెనుక శక్తితో ఇబ్బందులు?
X
తెలంగాణ పాలనకు కర్త కర్మ క్రియ కేసీఆర్. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎంవోలో కేసీఆర్ తర్వాత అంతా ఆయనే అయ్యి అన్నీ తానై వ్యవహరిస్తున్నాడట.. కేసీఆర్ ను మించి పాలన - అధికార వ్యవహారాల్లో అందరినీ పక్కనపెట్టి తలదూరుస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారట.. ఇప్పుడు తెలంగాణలో మరో కేసీఆర్ లా వ్యవహరిస్తున్న ఈయన తీరు చూసి తెలంగాణ అధికారులు - ఐఏఎస్ లు - చివరకు మంత్రులు కూడా బాధితులుగా మిగిలిపోతున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.

తెలంగాణకు సీఎంకు సలహాలు ఇవ్వడం ఆయన పని.. అవినీతి - మచ్చలేని అధికారి కావడంతో కేసీఆర్ తన పాలన వ్యవహారాల్లో కీరోల్ లో పెట్టుకున్నాడు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మించి ఇప్పుడు తెలంగాణలో పాలనలో ఆయన జోక్యం పెరిగిపోతోందట.. ఒక సామాజికవర్గానికే పోస్టింగ్ లు, ప్రమోషన్లు ఇవ్వడం.. ఫలానా పనులు, ప్రాజెక్టులు ఇతర సమస్యల్లో ఆయన చెప్పినట్లే చేయాలని ఆదిపత్యం చెలాయించడం అధికారులు, మంత్రులకు తలనొప్పిగా మారిందట..

కేసీఆర్ ఏరికోరి తెచ్చుకున్న ఆయనను ఎదురించే సాహసం ఇప్పటివరకూ ఎవరూ చేయడం లేదు. అయితే ఇది ఇలాగే కొనసాగితే అంతిమంగా అది అధికార - రాజకీయ వర్గాల్లో అసమ్మతికి దారితీయవచ్చు. కేసీఆర్ కు చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరి కేసీఆర్ చెబుతారా? లేక మరెవరైనా ఆయనను కట్టడి చేస్తారా అన్నది వేచిచూడాలి.