Begin typing your search above and press return to search.

ఆ మంత్రిని చూసి.. సీఎం భ‌య‌ప‌డ్డారట‌?

By:  Tupaki Desk   |   18 May 2021 5:30 PM GMT
ఆ మంత్రిని చూసి.. సీఎం భ‌య‌ప‌డ్డారట‌?
X
కేరళ రాష్ట్రంలో సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతున్నాయి. ఈ మ‌ధ్య‌నే ఎన్నిక‌లు జ‌రిగాయి కాబ‌ట్టి.. కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే.. ఫస్ట్ వేవ్ లో మాత్రం అత్యల్ప కేసులు నమోదైన రాష్ట్రాల్లో ముందు వ‌ర‌స‌లో నిలిచింది కేర‌ళ‌. దేశంలో తొలి కేసు న‌మోదైన ఈ రాష్ట్రం.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకొని.. క‌రోనాను తొక్కి నార‌తీసింది.

దీనివెనుక రాష్ట్ర ఆరోగ్య‌మంత్రి శైలజ పాత్ర అమోఘం. ఇది మ‌నం చెప్పే మాట కాదు.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియా ఎలుగెత్తి చాటిన విష‌యం. రాష్ట్రంలో వైర‌స్ వ్యాపించ‌కుండా ఆమె ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నారు. విరామం అనేదే లేకుండా కృషి చేశారు. ఇక‌, వ్యాక్సినేష‌న్ కూడా ఇత‌ర రాష్ట్రాల‌క‌న్నా మెరుగ్గా కేర‌ళ‌లో సాగేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేశారు. ఎన్నిక‌లు మొద‌ల‌య్యే వ‌ర‌కు త‌న బాధ్య‌త‌ల‌కు వంద శాతం న్యాయం చేశారు శైల‌జ‌.

ఎన్నిక‌ల ఫ‌లితాల్లో విజ‌యం సాధించిన‌ ఎల్డీఎఫ్‌.. మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మంత్రిగా పిన‌ర‌యి విజ‌య‌న్ మ‌రోసారి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అయితే.. ఆయ‌న మంత్రివ‌ర్గంలో శైల‌జ‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది!

ఎన్నిక‌ల్లో కుత్తుప‌రంబ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన శైల‌జ‌.. భారీ విజ‌యాన్ని అందుకున్నారు. ప్ర‌జ‌లు ఆమెకు ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీని అందించారు. కేర‌ళ అసెంబ్లీ చ‌రిత్రిలోనే ఇది రికార్డు మెజారిటీ. ఈ విష‌యం చాలు ఆమెపై ప్ర‌జ‌ల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో చాటి చెప్ప‌డానికి.

అలాంటి శైల‌జ‌కు మంత్రివ‌ర్గంలో స్థానం ఎందుకు ఇవ్వ‌లేద‌నే చ‌ర్చ గ‌ట్టిగానే జ‌రుగుతోంది కేర‌ళ‌లో. అయితే.. చాలా మంది మాత్రం ఆమె అభిమానానికి భ‌య‌ప‌డే ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. మ‌రోసారి మంత్రిప‌ద‌వి ఇస్తే.. మ‌రింత పాపులారిటీ పెరిగే అవ‌కాశం ఉంద‌ని, దానివ‌ల్ల భ‌విష్య‌త్ లో ఇబ్బందులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని భావించే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని అంటున్నారు.

ఇత‌ర‌ పార్టీల్లో ఇలాంటి వ్య‌వ‌హారం సాగుతుంటుంది. కానీ.. క‌మ్యూనిస్టు పార్టీలోనూ ఇలా ఉంటుందా? అని చ‌ర్చించుర‌కుంటున్నారు. మ‌రి, దీనికి ముఖ్య‌మంత్రి ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.