Begin typing your search above and press return to search.

8 నెలల పాలన... జగన్ ఎన్నెన్నో సంచలచనాలు

By:  Tupaki Desk   |   23 Jan 2020 7:52 AM GMT
8 నెలల పాలన... జగన్ ఎన్నెన్నో సంచలచనాలు
X
వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి 8 నెలలు కావస్తోంది. ఈ 8 నెలల కాలంలో జగన్ చాలా దూకుడుగ ా వ్యవహరించడంతో పాటుగా సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న నిర్ణయీలు తీసుకున్నారు. జగన్ సర్కారు మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు గానీ, ఇతరత్రా నిర్ణయాలు గానీ... ఏపీని దేశం లోనే ఓ ప్రత్యేకత కలిగిన రాష్ట్రంగా మారిపోయిందని చెప్పాలి. ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఇదివరకు ఏ ఒక్కరూ తీసుకోనిదేనని చెప్పాలి. ఇలా ఏ నిర్ణయం తీసుకున్నా... ఇదివరకు సీఎంలుగా వ్యవహరించిన ఏ ఒక్క నేత కూడా తీసుకున్న దాఖలా లేదన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారిపోయేందుకు జగన్ సంచలన నిర్ణయాలు దోహదం చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ దిశగా జగన్ తీసుకున్న వరుస నిర్ణయాలను ప్రస్తావించుకుంటే... తాను సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో ప్రమాణం చేయించి సంచలనం సృష్టించారు. ఆ ఐదు డిప్యూటీ సీఎం పోస్టులు రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారితో భర్తీ చేసి కూడా జగన్ ఆదర్శంగానే నిలిచారు. అంతే కాకుండా తన కేబినెట్ లో అన్ని సామాజిక వర్గాలకు స్థానం కల్పించిన జగన్.... మిగిలిన అందరు సీఎంలకు ఆదర్శంగా నిలిచారనే చెప్పాలి. అంతేకాకుండా తమ ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పోస్టుల్లో బడుగులకు ఏకంగా 50 శాతం పదవులను కేటాయిస్తానని కూడా జగన్ సంచలన ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే ఆయా పదవుల భర్తీలో జగన్ చాలా దూకుడుగానే సాగుతున్నారు.

ఇక ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలను ప్రారంభించిన జగన్... దేశంలొో ఏ ఒక్క రాష్ట్రంలో లేని సంక్షేమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాల్లో అమ్మ ఒడి పథకాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ తరహా పథకం దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేదని కూడా చెప్పక తప్పదు. ఈ పథకం కింద పేద వర్గాలకు చెందిన మహిళ తన పిల్లలను బడిలో చేర్పిస్తే చాలు... ఆమెకు నేరుగా రూ.15 వేలను ఇవ్వదలచిన ఈ పథకం తొలి దశలో రాష్ట్రంలోని ఏకంగా 40 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ అయిపోయింది. అదే సమమంలో మధ్యాహ్న భోజన పథకానికి గోరు ముద్ద అనే పేరును తగిలించేసిన జగన్ సర్కారు... పిల్లలకు నాణ్యమైన భోజనంతో పాటు రోజూ ఓ రకమైన భోజనాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టారు.

ఈ నిర్ణయాలన్నీ ఒక ఎత్తైతే... ఏపీకి మూడు రాజధానుల దిశగా సాగుతున్న జగన్... ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని లెజిస్లేటివ్ కేపిటల్ కు మాత్రమే పరిమితం చేస్తూ...ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖకు, జ్యూడిషియల్ కేపిటల్ ను కర్నూలుకు తరలించే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఈ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించగా... విపక్షం టీడీపీ బలం ఉన్న శాసనమండలిలో మాత్రం బ్రేకు పడింది. ఈ బిల్లుకు మండలిలో పడిన బ్రేకు తాత్కాలికమే అయినా... త్వరలోనే జగన్ తాను అనుకున్నట్లు గానే ఏపీకి మూడు రాజధానులను చేసి తీరతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... దేశంలో మూడు రాజధానులు కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. మొత్తంగా ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా జగన్ చేపడుతున్న చర్యలు వరుసగా సాకారమవుతున్నాయనే చెప్పాలి.