Begin typing your search above and press return to search.

ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం.. ఎవరు చేశారంటే?

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:10 AM GMT
ఘనంగా కేసీఆర్ దత్తపుత్రిక నిశ్చితార్థం.. ఎవరు చేశారంటే?
X
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష నిశ్చితార్థం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రత్యూష కోరుకున్న వాడితోనే ఈ వేడుకను వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ విద్యానగర్ లోని ఓ హోటల్ లో రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది.

సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దగ్గరుండి జరిపించారు. నర్సింగ్ కేరీర్ పూర్తి చేసిన ప్రత్యూష ప్రస్తుతం ఒక ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. తాజాగా ఆమె తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. దీనికి కేసీఆర్ తోడ్పాటు నందిస్తున్నారు.

ప్రత్యూషకు కాబోయే భర్త రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డి. ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రత్యూష గురించి తెలుసుకొని చరణ్ రెడ్డి ఆమెను పెళ్లి చేసుకునేందుకు ప్రపోజ్ చేశారు. దీంతో చరణ్ రెడ్డిని పెళ్లి చేసుకుంటానన్న విషయాన్ని సీఎం కేసీఆర్ కు ప్రత్యూష ఇటీవల తెలియజేసింది. దీంతో ప్రత్యూషను ప్రగతి భవన్ కు పిలిపించి మరీ కేసీఆర్ మాట్లాడారు. ఆమె ఇష్టాన్ని గుర్తించిన కేసీఆర్.. పెళ్లికి ఓకే చెప్పేశారు. పెళ్లికి వస్తానని కేసీఆర్ చెప్పారని ప్రత్యూష చెబుతోంది.

2017లో కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావు బ్రతుకుల మధ్య ప్రత్యూష ఆస్పత్రిలో చేరింది. అమ్మాయి దీనగాథ తెలుసుకొని చలించిపోయిన సీఎం కేసీఆర్.. అప్పట్లో హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. తరువాత ఆమెను తన దత్త పుత్రికగా ప్రకటించారు. సంరక్షణ బాధ్యతలను ఐఏఏస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యూష యోగ క్షేమాలను చూస్తోంది. ఐదేళ్లలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఎదిగిన ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే అన్నట్టుగా కేసీఆర్ ఆమెకు పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు.