Begin typing your search above and press return to search.

క‌ర్ర‌విడిచి సాము చేస్తే.. మొద‌టికే మోస‌మేమో బాబూ..!

By:  Tupaki Desk   |   25 Nov 2022 9:30 AM GMT
క‌ర్ర‌విడిచి సాము చేస్తే.. మొద‌టికే మోస‌మేమో బాబూ..!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ విజృంభించాల‌ని.. పార్టీ అధికారంలోకి తీసుకురావాల‌ని.. టీడీపీ అదినేత చంద్ర‌బా బు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత తీసుకుంటున్న నిర్ణ‌యాలు..చేస్తున్న వ్యాఖ్య లు .. ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్తున్న విష‌యాలు మాత్రం క‌ర్ర విడిచి సాము చేస్తున్న ప‌రిస్థితిని త‌ల‌పించేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు రెండు వ్యూహాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తు న్నారు.

ఒక‌టి.. తాను లేక‌పోతే..రాష్ట్రం అభివృద్ధి చెంద‌దు.. అనే కామెంట్‌. రెండు, ఇవే రాష్ట్రానికి చివ‌రి ఎన్నిక‌లు (ముందు త‌న‌కు అన్నారు. త‌ర్వాత మార్చార‌నుకోండి!) అన్నారు. అంటే.. ఈ రెండు వ్యూహాల వెనుక‌.. ఉన్న‌ది సింప‌తీని ద‌క్కించుకోవ‌డ‌మే కాదు.. అసలు వైసీపీ ప్ర‌భుత్వానికి ఏమీ చేత‌కాదు.. పాల‌న, ప్ర‌భుత్వా న్ని న‌డిపించ‌డం వంటి అనేక విష‌యాలు మాకు మాత్ర‌మే తెలుసు! అని ప్ర‌జ‌ల‌కు చెప్పుకొని.. త‌ద్వారా ల‌భించే ఓట్ల‌తో తిరిగి అధికారంలోకిరావాల‌నేది బాబు వ్యూహంగా క‌నిపిస్తోంది.

అయితే..ఈ రెండువ్యూహాలు కూడా.. ప్ర‌జ‌ల్లో రివ‌ర్స్ అవుతాయ‌నేది పార్టీ సీనియ‌ర్ల మాట‌. ఎందుకంటే.. ఈ "భూమి.. నేను పుట్టిన‌ప్ప‌టి నుంచి ఉంది.. నాతో పాటే ఉంటుంది.. నాత‌ర్వాత‌.. " అన్న‌ట్టుగా చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని అంటున్నారు. వైసీపీ ప్ర‌భుత్వంలో కొన్ని లోపాలు ఉన్న మాట వాస్త‌వ‌మే. దీనిని ఎవ‌రూ తోసిపుచ్చరు. వైసీపీ నాయ‌కులు కూడా అంగీక‌రిస్తారు(జ‌గ‌న్ ఒప్పుకొంటే). అయితే.. అంత‌మాత్రాన జ‌గ‌న్‌కు పాల‌నే చేత‌కాదా? అంటే.. మౌన‌మే స‌మాధానం.

ఎందుకంటే.. కీల‌క‌మైన స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌.. క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది. నాడు-నేడుతో అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు(దీని వెనుక పొలిటిక‌ల్ యాంగిల్ ఉండొచ్చు). అదేస‌మ‌యంలో త‌న మంత్రి వ‌ర్గం.. బీసీలు, ఎస్సీల‌కు ఎక్కువ‌గా సీట్లు ఇచ్చారు. స్థానిక సంస్థ‌ల్లోమ‌హిళ‌ల‌కు 50 శాతం కోటా అమ‌లు చేశారు. అమ్మ ఒడి.. చేదోడు.. వంటి కార్య‌క్రమాల‌తో మ‌హిళ‌ల‌ను త‌న‌వైపుతిప్పుకొన్నారు. జిల్లాల‌ను విభ‌జ‌న చేసి.. మెప్పు పొందారు.

కాబ‌ట్టి.. జ‌గన్‌కు పాల‌న చేత‌కాదు.. అని అనుకునే ప‌రిస్థితి లేద‌ని చంద్ర‌బాబు గుర్తించాలి. అంతేకాదు. త‌న‌తోనే డెవ‌ల‌ప్ మెంట్ ఆగిపోయింద‌నేది కూడా ఆయ‌న భావించ‌డం స‌రికాదు. ఇక‌, అదేస‌మ‌యంలో ఇదే లాస్ట్ అంటే.. ఇక‌, 2024 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. రాష్ట్రంలో ఎన్నిక‌లే జ‌ర‌గ‌వా? అంటే.. అదేం లేదు.. చంద్ర‌బాబు బ‌య‌ట ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతాయి.. నాయ‌కులు గెలుస్తారు.. ప్ర‌జ‌లు ఓట్లేస్తారు.

అంటే.. మొత్తంగా.. ఈ రెండువ్యూహాలు కూడా టీడీపీకి మైన‌స్‌గా మారిపోయాయ‌నేది వాస్త‌వం. కాబ‌ట్టి.. క‌ర్ర విడిచి సాము చేయ‌డం మానేసి.. ప్ర‌భుత్వ‌వైఫ‌ల్యాలు.. ఇత‌ర‌త్రా కీల‌క ప్రాజెక్టులు వంటివాటిని హైలెట్ చేసుకుంటే.. త‌ప్ప‌.. చంద్ర‌బాబు వ్యూహం పార‌దనేది ప‌రిశీల‌కుల మాట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.