దేవేగౌడ రుణాన్ని తీర్చుకుంటున్న చంద్రబాబు!

Mon Apr 15 2019 15:42:35 GMT+0530 (IST)

CBN All Set To Campaign For Flop Hero

ఇటీవలే ఏపీకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి వెళ్లిన మాజీ ప్రధాని దేవేగౌడ రుణాన్ని చెల్లించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. ఏపీలో చంద్రబాబును గెలిపించాలని దేవేగౌడ ప్రచారం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే. దేవేగౌడ బాబు తరఫున ప్రచారం చేయడమే కాదు చంద్రబాబుకు పీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేవేగౌడ అలా పొగిడే సరికి బాబు కూడా సిగ్గుపడిపోయారు!గత కొన్నాళ్లుగా జేడీఎస్ తో చంద్రబాబు నాయుడు చాలా సన్నిహిత సంబంధాలు నెరుపుతూ ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఆ పరిస్థితి ఉంది. అప్పటి నుంచి బాబు కు బీజేపీకి శత్రుత్వం పెరిగింది.ఆ నేపథ్యంలో ఆయన జేడీఎస్ ను సపోర్ట్ చేస్తూ వస్తున్నారు.

దాంతో దేవేగౌడ వచ్చి బాబు తరఫున ప్రచారం చేసి వెళ్లారు. ఇక అందుకు ప్రతిగా చంద్రబాబు మండ్య వెళ్లారు. అక్కడ దేవేగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనను గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా రుణాన్ని తీర్చుకొంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు.

మండ్యలో విజయాన్ని జేడీఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుమారస్వామి సీఎం సీట్లో ఉండటంతో అక్కడ నిఖిల్ గెలవకపోతే అంతే సంగతులు. అందుకే చంద్రబాబును కూడా అక్కడకు తీసుకెళ్లి జేడీఎస్ ప్రచారం చేయించుకొంటూ ఉంది.