Begin typing your search above and press return to search.

ఘుమఘుమలాడే బడ్జెట్‌ హల్వా సిద్ధం !

By:  Tupaki Desk   |   20 Jan 2020 10:40 AM GMT
ఘుమఘుమలాడే బడ్జెట్‌ హల్వా సిద్ధం !
X
కేంద్ర బడ్జెట్‌ ప్రక్రియ చేపట్టడానికి రంగం సిద్ధమైంది. ఈ బడ్జెట్ తయారీలో అధికారులు బిజీగా అయిపోతున్నారు. 2020, ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో 2020 - 21 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన పత్రాల ముద్రణ స్టార్ట్ అయ్యింది. అయితే, ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడాని కంటే ముందు సంప్రదాయబద్దంగా వస్తున్న హల్వా తయారు చేయడం ప్రారంభించారు. 2020, జనవరి 20వ తేదీ సోమవారం నార్త్ బ్లాక్‌ లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యాయలంలో హల్వా వేడుకల్లో పాల్గొన్నారు. పెద్ద కడాయిలో హల్వాను తయారు చేశారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, బడ్జెట్ తయారీలో పాల్గొనే అధికారులకు హల్వా రుచి చూపించారు.

బడ్జెట్ రూపకల్పన ఎలా జరుగుతుందనే విషయం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతారు. ఇందులో పాల్గొనే కీలక అధికారులు, సహాయ సిబ్బందికి ఆంక్షలుంటాయి. పని మొదలైనప్పటి నుంచి..పూర్తయ్యే వరకు కార్యాలయంలోనే ఉండాల్సి ఉంటుంది. వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. కుటుంబసభ్యలుతో కూడా మాట్లాడనీయరు. పోన్, ఈమెయిల్ అందుబాటులో ఉండవు. ఎవరితో సంప్రదింపులు వీలుండదు. ఆఫీసు లోపలకు బయటి వ్యక్తులకు నో ఎంట్రీ. బడ్జెట్ పూర్తిగా అయిపోయిన తర్వాత తలుపులు తెరుస్తారు. ముద్రణకు పంపే ముందు...హల్వా తయారు చేయడం సంప్రదాయంగా వస్తోంది. పెద్ద ముకుడులో దీనిని తయారు చేస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ సిబ్బంది పనిలో నిమగ్నం కావడానికి కంటే ముందు వారికి తీపి తినిపించాలనే ఉద్దేశ్యంతో హల్వా తయారు చేస్తారు. ఈ ఆచారం ఇప్పటికి కూడా అలానే కొనసాగుతూ వస్తుంది.