Begin typing your search above and press return to search.

చెల్లెలిపై అన్న అత్యాచారం..6 నెలల క్రితం దారుణం, ఎలా బయటపడిందంటే

By:  Tupaki Desk   |   26 Sep 2021 2:30 AM GMT
చెల్లెలిపై అన్న అత్యాచారం..6 నెలల క్రితం దారుణం, ఎలా బయటపడిందంటే
X
ప్రస్తుత రోజుల్లో ఆడపిల్లలు మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతోంది. విలువలు, వావి వరసలు మరుస్తున్న మృగాళ్లు అభం శుభం తెలియనివారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కామవాంఛతో రగిలిపోతూ చిన్నారులను చిదిమేస్తున్నారు. చెల్లిని ఆప్యాయంగా చూసుకోవాల్సిన వాడు ఆమెపైనే కన్నేశాడు. కీచకుడిగా మారి ఆమెపై కోరిక తీర్చుకున్నాడు. అన్న అనే పదానికే మచ్చతెచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదోతరగతి చదువుతోంది. ఆమెతో పెదనాన్న కుమారుడు చాలా క్లోజ్ గా ఉండేవాడు.

బాలిక కూడా అన్నయ్యా అంటూ అప్యాయంగా పిలిచేది. రోజూ చెల్లెలితో సరదగా మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీశానని ఎవరికైనా చెప్తే వాటిని సోషల్ మీడియా లో పెడతానని బాలికను బెదిరించాడు. దీంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. మూడు నెలల క్రితం బాలికకు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమెకు పరీక్షలు చేయగా.. ఆమె మూడు గర్భవతి అని, అప్పటికే అబార్షన్ అయిందని తెలిపారు.

దీనిపై బాలికను నిలదీయడంతో పెదనాన్న కుమారుడే ఈ పనిచేశాడని బాలిక బోరున విలపించింది. అయితే బయటకు చెప్తే పరువుపోతుందని ఎవరికీ చెప్పొద్దంటూ బంధువులు, కుటుంబ సభ్యులు బాలిక తల్లిదండ్రులకు సూచించారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయిన తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.