పుతిన్ మహిళ అయితే.. బ్రిటన్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

Wed Jun 29 2022 19:16:51 GMT+0530 (IST)

British Prime Minister Comments on Putin

ఉక్రెయిన్ పై భీకర యుద్ధానికి దిగి ఎంతకూ వెనక్కి తగ్గకుండా మూడు నెలలుగా నరమేధం సృష్టిస్తున్న రష్యా అధ్యక్షుడిపై ఇంటా.. బయటా విమర్శల వాన కురుస్తోంది. రష్యాపై ప్రపంచదేశాలు మండిపడుతూనే ఉన్నాయి. ఓవైపు ఉక్రెయిన్ కు సాయం చేస్తూనే మరోవైపు రష్యాపై ఆంక్షలు విధిస్తూ పుతిన్ సేనను కట్టడి చేసేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తాజాగా రష్యా అధ్యక్షుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఒకవేళ పుతిన్ మహిళ అయితే ఇటువంటి భీకర యుద్ధం మొదలు పెట్టకపోయేవారని బ్రిటన్ ప్రధాని హాట్ కామెంట్స్ కామెంట్స్ చేశారు. 'వాస్తవానికి పుతిన్ మహిళ కాదు. కానీ ఒకవేళ ఆయన మహిళే అయితే ఇప్పుడు చేస్తున్నట్లు ఉక్రెయిన్ పై పిచ్చి పురుషాహంకార దురాక్రమణను మొదలుపెట్టేవారు కాదని అనుకుంటున్నా.. పుతిన్ దండయాత్ర అనేది విషపూరితమైన పురుషత్వానికి సరైన ఉదాహరణ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.

చాలా మంది మహిళలు అధికారం చేపట్టాలని బోరిస్ జాన్సన్ ఆకాంక్షించారు. ఈ సందర్భంలోనే పుతిన్ తీరును ఉదాహరణగా తీసుకున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పులను ముప్పులను ఏవిధంగా ఎదుర్కోవాలనే విసయంపై చర్చించేందుకు నాటో దేశాలు సమావేశమయ్యే కొద్దిసేపటి ముందు బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ యుద్ధం ముగిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని.. కానీ అందుకు ప్రస్తుతం ఏ విధమైన పరిష్కార మార్గాలు కనిపించడం లేదని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. శాంతి కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఒకవేళ మాస్కోతో శాంతి చర్చలు సాధ్యమైతే మాత్రం అప్పుడు ఉక్రెయిన్ ను ఉత్తమమైన స్థితిలో ఉంచడానికి పాశ్చాత్య మిత్రదేశాలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు.

రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా రష్యా దుందుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపించిన సోవియట్ దేశం ఇప్పుడు స్వల్ప అణ్వస్త్రాలను ప్రయోగిస్తోంది.. స్వల్ప శ్రేణి అణుసామర్థ్య క్షిపణులను బెలారస్ కు తరలిస్తోంది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడం విశేషం. త్వరలో ఆయన బెలారస్ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు.  

ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం సుధీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందలో భాగంగా రష్యా క్షిపణులను బెలారస్ కు తరలిస్తోంది. ఇప్పటికే బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో సెయింట్ పీటర్స్ బర్గ్ కు చేరుకున్నారు. అక్కడ ఆయనతో మీట్ అయిన పుతిన్ ఆ తరువాత మాట్లాడారు. రానున్న కొన్ని నెలల్లో బెలారస్ కు ఇసికందర్ -ఎం టాక్టికల్ మిసైల్ వ్యవస్థలను అందించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీంతో ఇక ఉక్రెయిన్ పై స్వల్ప శ్రేణి ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.