జీతం సరిపోలేదని రాజీనామా చేస్తున్న ప్రధాని .. ఎవరంటే ?

Tue Oct 20 2020 21:20:09 GMT+0530 (IST)

Who is the resigning Prime Minister due to inadequate salary?

ఏదైనా ఒక కంపెనీ లో ఉద్యోగం చేస్తూ అక్కడ జీతం సరిపోక మరో కంపెనీలో మంచి ప్యాకేజి ఆఫర్ వస్తే చేస్తున్న ఉద్యోగం మానేసి కొత్త కంపెనీలో కొత్త ఉద్యోగం లో జాయిన్ అవ్వడం సర్వసాదరణం. ఇలా ఉద్యోగాలను వదిలేయడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఉద్యోగం కోసం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నాడట. ఏంటి ఉద్యోగం కోసం ప్రధాని పదవికి రాజీనామా చేస్తాడా అని ఆశ్చర్య పోయారు . కానీ ఇది నిజమే అని అంటున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు జీతం సరిపోవడం లేదు అనే కారణంతో రాజీనామా చేయబోతున్నట్టు బ్రిటన్ మీడియా కి చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలోనే మరో ఆరు నెలల కాలంలో బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం . అయితే బోరిస్ జాన్సన్ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టక ముందు ఒక పత్రికలో కాలమిస్టుగా పనిచేసే వారు. ఆ పత్రికలో ఆయనకు 2.75 (రూ 2.6 కోట్లు ) లక్షల పౌండ్ల వేతనం ఇచ్చేవారు. ఇక అదనంగా డబ్బులు కూడా వచ్చేవి. కానీ ఎప్పుడైతే ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారో అప్పటినుంచి బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రి పదవికి గాను 1.5 (రూ. 1.4 కోట్లు ) లక్షల పౌండ్ల జీతం మాత్రమే అందుకుంటున్నారు. దీంతో ఆయనకు ఆ జీతం సరిపోవడం లేదని తన ఆరుగురి సంతానాన్ని చూసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారట బోరిస్ జాన్సన్. ఏదేమైనా కూడా జీతం సరిపోవడం లేదని ప్రధాని రాజీనామా చేయడం బహుశా ఇదే ప్రధమం కావచ్చు. అయితే ప్రధాని అయితే కోట్లు కోళ్లకూడబెట్టచ్చు కదా అని అనుకుంటున్నారా .. అయన జీతం సరిపోక రాజీనామా చేయాలనుకుంటున్నాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు బోరిస్ తన పదవిలో ఎంత నిఖార్సుగా పని చేస్తున్నారో