Begin typing your search above and press return to search.

బ్రిటీషోల్లకు భారతీయుల విలువ తెలిసొచ్చింది..

By:  Tupaki Desk   |   26 Jun 2019 8:45 AM GMT
బ్రిటీషోల్లకు భారతీయుల విలువ తెలిసొచ్చింది..
X
భారతీయుల కలల దేశం ఏదని అంటే అంతా అమెరికా అనేస్తారు.. ప్రపంచంలో అన్ని అభివృద్ధి చెందిన దేశాలున్నా మనవాళ్లు అగ్రరాజ్యమైన అమెరికా వెళ్లడానికే ప్రాధన్యమిస్తారు. ఇప్పుడు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈవోలందరూ భారతీయులే.. మనవాళ్ల తెలివిని గుర్తించిన అమెరికా గత ప్రభుత్వాలు వలస విధానాలను సరళీకరించి అగ్రరాజ్యంగా ఎదిగాయి.

అయితే ఈ విషయంలో బ్రిటన్ దేశం చాలా వెనుకబడింది. భారతీయులను రెండున్నర శతాబ్ధాల పాటు పాలించి ఇంగ్లీష్ ను రుద్ది ఆలవాలంగా మార్చుకుంది. భారత్-బ్రిటన్ సంబంధాలు ఎంతో పురాతనమైనవి అయినా భారతీయులను ఆకట్టుకోవడంలో బ్రిటన్ దారుణంగా విఫలమైంది.. అదే బ్రిటన్ ఆర్థిక మందగమనానికి నిదర్శనమని స్వయంగా బ్రిటన్ పార్లమెంట్ లో ఆ దేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. భారతీయులకు వీసాల జారీ - ఇమిగ్రేషన్ నిబంధనలు సడలిస్తేనే మన దేశ పురోగతి సాధ్యపడుతుందని ఆ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది.

తాజాగా బ్రిటన్ పార్లమెంట్ లో ‘బిల్డింగ్ బ్రిడ్జెస్ - రీఅవేకింగ్ యూకే-ఇండియా టైస్’ పేరుతో బ్రిటన్ పార్లమెంట్ లో విచారణ కమిటీ ఈ నివేదికను ప్రవేశపెట్టింది. ప్రపంచ యవనికపై అద్వితీయమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ ను చెలిమి చేసుకోవడంతో బ్రిటన్ విఫలమైందని.. ఇప్పటికే భారతీయులకు వీసాలు - ఇమ్రిగ్రేషన్ పాలసీలను సడలించాలని నివేదికలో సూచించింది. భారతీయులు ఎక్కువగా అమెరికా - చైనాలకు చదువుకోవడానికి వెళ్లి అక్కడ ఆర్థిక పరిపుష్టికి కారణమవుతున్నారని.. ఈ విషయంలో బ్రిటన్ ఆకట్టుకోవడం లేదని నివేదికలో పొందుపరిచారు.

ఇప్పటికైనా బ్రిటన్ భారతీయ పర్యాటకులను - విద్యార్థులు - వృత్తి నిపుణులను ఆకర్శించడం ద్వారా భారత్ తో సంబంధాలు పెంచుకోవాలని పార్లమెంట్ లో చర్చ జరిగింది. భారత్ తో దూరం వల్లే బ్రిటనే నష్టపోయిందని.. ఇప్పటికే స్నేహ బంధాలు ఏర్పరుచుకోవాలని సూచించింది. బ్రిటన్ ఇంగ్లీష్ ఈజీగా ఉన్నా భాష అర్థం కాని చైనాకే భారతీయ విద్యార్థులు - నిపుణులు ఎక్కువగా వెళుతున్నారని నివేదిక వెల్లడించింది.

ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన బ్రిటన్ కు ఇప్పుడు భారత్ తో సంబంధాలు కాపాడుకోవాలని బ్రిటీష్ ఎంపీలు చర్చలో సూచించారు. చైనాతో పోలిస్తే సంబంధాలు - భాష - ప్రజాస్వామ్య విలువల విషయంలో బ్రిటన్ కు భారత్ చాలా దగ్గర. అందుకే ఇప్పటికైనా భారత్ తో సంబంధాల కోసం వీసాల జారీ - ఇమ్రిగ్రేషన్ లో సడలింపులు అవసరం అని ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. భారతీయులకు ద్వారాలు తెరిస్తేనే బ్రిటన్ ఆర్థికంగా ఎదుగుతుందని కుండబద్దలు కొట్టారు.