అత్త దగ్గరుండి మరీ భర్తతో రేప్ చేయించేది!!

Sun Aug 09 2020 10:45:10 GMT+0530 (IST)

Bribe Forced into Arranged Marriage Was Raped by Groom as Mom Gave Instructions From Door

తన పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా అందరిని ఆకర్షించిన రచయిత్రి తాజాగా తన వైవాహిక జీవితానికి సంబంధించిన  నిజాల్ని వెల్లడించి షాకిచ్చింది. వింగ్స్ పుస్తకంతో అందరికి సుపరిచితురాలిగా మారిన సన్నీ యాంజిల్ తాజాగా తన వైవాహిక జీవితంలో ఎదురైన ఒడిదుడుకుల్ని.. తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓపెన్ గా చెప్పుకొచ్చారు. విన్నంతనే ఒళ్లు జలదరింపుకు గురి కావటమే.. ఇంతటి దారుణ పరిస్థితా? అన్న భావన కలుగక మానదు. ఇలాంటి అనుభవం ఎవరికి ఉండకూడదన్న వేదన కలుగుతుంది.ప్రస్తుతం ఇంగ్లండ్ లోని సరీ ప్రాంతంలో ఆమె నివసిస్తున్నారు. పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఆమె భర్తతో విడిపోయారు. తన వైవాహిక జీవితం గురించి ఆమె చెబుతూ.. ‘ఇష్టం లేని పెళ్లికి ఒప్పించారు. బలవంతంగా చేశారు. నేను కాదన్నాను. కానీ.. ఇంట్లో వారు ఒప్పుకోలేదు. అజయ్ మతిస్థిమితం లేని వాడన్న విషయం తెలీదు. ఇంట్లో వారి ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. కట్నంగా రూ.9.31లక్షలు.. బెంజ్ కారు తీసుకున్నారు. పెళ్లి సమయంలో అజయ్ మొదటిసారి మాట్లాడాడు. నేనునిన్న పెళ్లి చేసుకుంటా. పెళ్లికి ఖర్చులు అవుతాయని అమ్మ చెప్పిందని చెప్పాడు. అతడి మాటలు అర్థం కాలేదు. పెళ్లి తర్వాత కానీ అతను మతిస్థిమితం లేని వ్యక్తి అన్న విషయం తెలిసింది’’ అని పేర్కొన్నారు.

పెళ్లైన రోజున బలవంతంగా భర్తతో సెక్సు చేయించారన్నారు. ఆ నరకాన్ని ఆమె బయటపెడుతూ.. ‘‘అజయ్ కు సెక్సు అంటే ఏమిటో తెలీదు. అతడి తల్లి.. పోర్న్ వీడియోలు చూపించేది. సెక్స్ ఎలా చేయాలో చెప్పేది. బెడ్రూం కిటికీలో నుంచి చూస్తూ.. సెక్సు ఎలా చేయాలో చెప్పేది. ఆ సమయంలో అతడు బట్టలు కూడా విప్పేవాడు కాదు. ఎందుకంటే.. అతడిలో ఏదో భయం ఉండేది. నాకు ఇష్టం లేదని అత్తకు చెబితే.. తనకు పిల్లలు కావాలంటూ  నా మీద దాడి చేసేది. అజయ్ కు చాక్లెట్ ఆశ చూపించి బలవంతంగా సెక్సు చేయించేది. సెక్సు చేసిన తర్వాత.. నువ్వు చెప్పింది చేశా.. నా చాక్లెట్ ఇవ్వు అని తీసుకొని వెళ్లిపోయేవాడు’’ అంటూ భయానక అనుభవాన్ని బయటపెట్టారు.

భర్త నుంచి విడిపోయిన తర్వాత కూడా అతడి మీద కించిత్ కంప్లైంట్ చేయని సన్నీ.. అత్త మీదనే విమర్శలు చేయటం గమనార్హం. ‘‘అతను అమాయకుడు. చిన్నపిల్లవాడు.మతిస్థిమితం లేని వాడు. అతని తప్పేం లేదు. నేను అతడ్ని విడిచిపెట్టిన వచ్చేసిన తర్వాత అతనికి వాళ్ల అమ్మ అన్నంపెట్టటం మానేసింది. దీంతో.. అతను ఆసుపత్రి పాలయ్యాడు. ఇదంతా చెబుతున్నది.. మరే అమ్మాయి కూడా మోసపోకూడదనే’’ అంటూ తన అనుభవాల్ని వెల్లడించారు. ఇదంతా విన్నప్పుడు ఇలాంటి భయానక సమస్యల్ని కూడా ఎదుర్కొంటారా? అన్న భయం కలుగకమానదు.