బ్రేకింగ్: విశాఖ పాలనా రాజధానికి బ్రేకులు

Tue Aug 11 2020 12:30:49 GMT+0530 (IST)

Breaking: Breaks to the administrative capital of Visakhapatnam

ఏపీ సీఎం జగన్ కలల రాజధాని విశాఖపట్నం అని అందరికీ తెలిసిందే. ఎంత మంది అడ్డువచ్చినా.. హైకోర్టుల్లో స్టేలు వచ్చినా జగన్ మాత్రం విశాఖ నుంచే పాలించాలని పట్టుదలగా ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీని పిలిచి ఈనెల 16న విశాఖ పాలన రాజధానికి శంకుస్తాపన చేయాలని నిర్ణయించారు.కానీ ఇప్పుడు శంకుస్థాపన  కార్యక్రమం వాయిదా పడింది. ఓ వైపు కోర్టు కేసులు ఉండడం.. ఇటు ప్రధాని మోడీ ఆహ్వానం మరో కారణమని తెలుస్తోంది. దసరా సమయంలో శంకుస్థాపన చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ప్రధాని నరేంద్రమోడీని విశాఖ రాజధాని శంకుస్థాపనకు రావాలని లేదంటే కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ప్రారంభించాలని జగన్ అపాయింట్ మెంట్ కోరారు. కానీ ఇంతవరకు పీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. ఆగస్టు 16 దగ్గర పడింది. ఇటు హైకోర్టు అమరావతి రాజధానిపై స్టేటస్ కో విధించింది. దీంతో ప్రభుత్వం మూహార్తాన్ని వాయిదా వేసిందట..

ఆగస్టు 16 తర్వాత విశాఖకు రాజధాని తరలించి పాలించాలని జగన్ సర్కార్ యోచించింది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వచ్చే దసరాకు ముహూర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.