ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ నే మించిపోయాడుగా..!

Sat Mar 28 2020 21:36:53 GMT+0530 (IST)

Brazil President Jair Bolsonaro criticises New Virus lockdown

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉండో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అయిదు లక్షలను క్రాస్ చేసింది. వారం పది రోజుల్లో పది లక్షలకు చేరినా కూడా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటున్నారు. అమెరికాలో అత్యధికంగా లక్ష కేసులు నమోదు అయ్యాయి. పలు నగరాలు అత్యంత క్రిటికల్ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అయినా కూడా అమెరికాలో మాత్రం లాక్ డౌన్ ను ప్రకటించేందుకు అధ్యక్షుడు ట్రంప్ నిరాకరిస్తున్నాడు.అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందంటూ లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటిస్తున్నాడు తప్ప లాక్ డౌన్ ను మాత్రం ప్రకటించడం లేదు. ట్రంప్ రూట్ లోనే బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో కూడా ప్రవర్తిస్తున్నాడు. బ్రెజిల్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సమయంలో లాక్ డౌన్ ప్రకటించాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాని జెయిర్ మాత్రం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని కార్ల ఉత్పత్తి ఆపేసుకుంటామా.. జాగ్రత్త పడాలి ముందుకు సాగాలి. అలాగే కరోనా నుండి జాగ్రత్తగా ఉంటూ పని చేసుకోవాలంటూ సూచిస్తున్నాడు. ఇతడి తీరు ట్రంప్ ను మించి ఉంది కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఇండియాలో లాక్ డౌన్ విధించి కరోనా వ్యాప్తిగా తగిన చర్యలు తీసుకుంటున్నారంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అభినందించారు. లక్షల కోట్ల నష్టం అయినా కూడా ప్రజల ఆరోగ్యంను దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ ను ప్రకటించారు.