Begin typing your search above and press return to search.

బీసీ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 PM GMT
బీసీ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
X
బీసీలంటే వెనుకబడిన తరగతులకు చెందిన వారు మాత్రమే. అలాగే బ్రాహ్మణులంటే అగ్రవార్ణాలు మాత్రమే. పై రెండు సామాజికవర్గాలకు సంబంధించిన నిర్వచనంలో ఎలాంటి విపరీతార్ధాలు లేవు. కాబట్టి బీసీ వెల్పేర్ డిపార్టుమెంటులోకి వెనుకబడిన కులాలు, ఉపకులాలకు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవటమే టార్గెట్ గా ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను పెట్టింది. ఇదే పద్దతిలో అగ్రవర్ణాలైన బ్రాహ్మణుల్లోని పేదలను ఆదుకునేందుకు మరో కార్పొరేషన్ ఏర్పాటయ్యింది.

అంటే బీసీల కోసం ప్రత్యేకించి ఓ శాఖ అలాగే వారిని ఆదుకునేందుకు కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. కాబట్టే బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకించి ఓ కార్పొరేషన ఏర్పాటైంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తాజాగా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ ను తీసుకొచ్చింది. ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నది ? ఎందుకంటే ఆర్ధికంగా వెనకబడిన కులాల కార్పొరేషన్లను బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలోకి చేర్చటం వల్ల నిధుల సమస్య లేకుండా అని ప్రభుత్వం చెప్పింది.

ఇక్కడే అనుమానం వస్తోంది. కార్పొరేషన్లకు నిధుల సమస్య ఉందన్నపుడు అసలు కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటుచేసినట్లు ? ఆర్ధికంగా వెనకబడిన కులాలన్నపుడు పేదరికం సమస్య అన్నీ కులాల్లోను ఉంది. కమ్మ, క్షత్రియ, కాపు కులాల్లో పేదలు లేరా ? లేదా ఆ కార్పొరేషన్లకు ప్రభుత్వం ఫుల్లుగా నిధులందిస్తోందా ? ఆర్ధికంగా ఇబ్బందులనే పరిగణలోకి తీసుకుంటే బ్రాహ్మణ కార్పొరేషన్ను బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలోకి చేర్చినట్లే కమ్మ, క్షత్రియ, కాపు కార్పొరేషన్లను కూడా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు పరిధిలోకి చేరుస్తుందా ?

కార్పొరేషన్లను ఆర్ధికంగా బలోపేతం చేయాలంటే వాటిని ఏర్పాటుచేసి గాలికొదిలేయటం కాదు. ఏర్పాటు చేసిన అన్నీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలి. అప్పుడే కార్పొరేషన్ల ద్వారా సదరు కులాలకు చెందిన పేదలు ఏదో రూపంలో లబ్దిపొందుతారు. లేకపోతే కార్పొరేషన్ల ఏర్పాటు కేవలం అలంకారానికి మాత్రమే పరిమితమైపోతుంది. మహా అయితే కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్లు ప్రింట్ చేయించుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది.