కుళ్లిన స్థితిలో ఆ నటుడు.. అప్పటిదాకా పట్టలేదెందుకు?

Fri Dec 03 2021 15:11:11 GMT+0530 (IST)

Brahma suspicious death become a sensation

కరోనా ముందు ఇలాంటి ఉదంతాల్ని విన్నది లేదు. ఏ ముహుర్తంలో మొదలైందో కానీ మహమ్మారిఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి చిత్రపరిశ్రమకు సంబంధించి ఎప్పుడూ వినన్ని విషాద ఉదంతాల్ని తరచూ వినాల్సి వస్తోంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి బయటకు వచ్చింది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు.మీర్జాపూర్ సిరీస్ తోపాటు.. దంగల్.. సూపర్ 30 సినిమాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు బ్రహ్మ స్వరూప్ మిశ్రా. తాజాగా అతగాడు అనుమానాస్పద రీతిలో మరణించటం ఇప్పుడు సంచలనంగా మారింది. చిత్ర పరిశ్రమతో పాటు.. అభిమానులు వేదన చెందుతున్నారు.

ముంబయిలోని వర్సోవా సొసైటీలో అద్దెకు ఉండే బ్రహ్మ.. కొద్ది రోజులుగా ఇంట్లో నుంచి బయటకు రావటం లేదని స్థానికులు చెబుతున్నారు. కరోనా వేళ.. అనారోగ్యం కారణంగా ఇంట్లో నుంచి రావట్లేదని ఎవరికి వారు అనుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు.

డూప్లికేట్ తాళంతో ఇంటి తలుపు తెరిచిన చూసిన వారు.. షాక్ తిన్నారు. ఎందుకంటే.. కుళ్లిన స్థితిలో బ్రహ్మ స్వరూప్ డుడ్ బాడీ పడి ఉది. ఇదెలా జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇంట్లోనే అలా ఎలా చనిపోయారు? అతడి మరణం అనారోగ్యమా? మరేదైనా కారణమా? అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బ్రహ్మ స్వరూప్ ఇంట్లో ఒక్కడే ఉండేవాడని.. గుండె పోటుతో చనిపోయి ఉండొచ్చు ఏమోనన్న మాట వినిపిస్తోంది.

అతడి మరణం గురించిన తెలిసిన సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. మీర్జాపూర్ చిత్రంలో మున్నాభాయ్ కు అనుచరుడిగా నవ్వులు పూకించిన అతను మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ.. ఇలాంటి దారుణ స్థితిలో మరణించటం..చనిపోయిన తర్వాత ఇంత కాలానికి గుర్తించటమా? అన్నది ప్రశ్నగా మారింది.