బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

Sun Oct 18 2020 17:00:53 GMT+0530 (IST)

BrahMos supersonic cruise missile test successful

సరిహద్దుల్లో చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ.. భారత్ వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తూ దాయాది దేశానికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. పాకిస్తాన్ చైనాలకు పరోక్షంగా తమ ఆయుధ సామర్థ్యాన్ని చూపిస్తూ సవాల్ విసురుతోంది. క్షిపణి ప్రయోగాల్లో భారత్ ఒక్కో అడుగు వేస్తూ విజయపథంలో నడుస్తోంది. తాజాగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కోల్ కతా శ్రేషి డెస్ట్రాయర్ వద్ద ‘ఐఎన్ఎస్ చెన్నై’ యుద్ధ నౌక నుంచి ఆదివారం పరీక్షించారు. అరేబియా మహాసముద్రంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి ఛేదించడంతో శాస్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

 ఈ బ్రహ్మోస్ క్షిపణులు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలవు.. దీనిని ఇండియన్ నేవీ ప్రాజెక్టు 15ఏ లో భాగంగా స్వదేశీయంగా అభివృద్ధి చేశారు. 164 మీటర్ల పొడవు 7500 టన్నుల బరువున్న ఈ క్షిపణి 30 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతుంది.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ఈ ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేధిస్తుందని డీఆర్డీవో తెలిపింది.ఈ ఆయుధంతో ఇండియన్ నేవి బలం మరింత పెరిగిందని.. ప్రధాన ఆయుధంగా ఇది సేవలు అందించలగలదని పేర్కొంది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో బ్రహ్మోస్ ఇండియన్ నేవి సిబ్బందితోపాటు శాస్త్రవేత్తలను డీఆర్డీవో అధికారులను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందించారు.