Begin typing your search above and press return to search.

రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వం లక్ష్యం : బొత్స!

By:  Tupaki Desk   |   17 Jan 2020 11:32 AM GMT
రాష్ట్ర అభివృద్దే మా ప్రభుత్వం లక్ష్యం : బొత్స!
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌ మోహన్‌ రెడ్డితో హైపవర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో సీఎంకు కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అంతేకాదు శనివారం మరోసారి సమావేశం కానుంది. కమిటీ తుది నివేదికకు రూపకల్పన చేసి.. రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ నెల 20న దీనిపై కేబినెట్‌ లో చర్చించి.. తర్వాత అసెంబ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్దే తమ ప్రభుత్వం ధ్యేయం అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి రైతులకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలు చేశారని బొత్స వెల్లడించారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలు చర్చిస్తామని తెలిపారు.

మూడుసార్లు హైపవర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించిందని.. ఈ భేటీలో రైతులకు మరింత మేలు చేసేలా సీఎం సూచనలు చేశారన్నారు. మంత్రి వ్యాఖ్యల్ని బట్టి.. ప్రభుత్వం అమరావతి రైతుల కోసం స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ భేటీ సందర్భంగా జీఎన్‌ రావు - బీసీజీ నివేదికలపై హైపవర్‌ కమిటీ సభ్యులు సీఎం వైఎస్‌ జగన్‌ కు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. అమరావతి రైతుల అంశంపైనా సీఎం వైఎస్‌ జగన్‌ తో చర్చించినట్టు తెలిపారు. కమిటీ రిపోర్ట్‌ లోని అంశాలను కూడా సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమగ్ర ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారించినట్టు వివరించారు. కమిటీ రిపోర్ట్‌ను కేబినెట్‌ ముందు ఉంచుతామని తెలిపారు.

సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. అలాంటి చర్చ రాలేదని - మీకెవరు చెప్పారని తనదైన శైలిలో బొత్స సమాధానం ఇచ్చారు. రైతుల సలహాలకు సంబంధించిన ఈ-మెయిల్ పనిచేయడం లేదని అంటే.. తాను కమిషనర్‌ తో మాట్లాడానని.. కావాలని కొన్ని మీడియా సంస్థలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. రైతాంగం అంటే బ్రాండ్ అంబాసిడర్ వై ఎస్ ఆర్ అని గుర్తుచేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదని - దేశవ్యాప్తంగా రైతుల కోసం పాటుపడే నేత ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెబుతారు. ఆయన కుమారుడు - ప్రస్తుత సీఎం జగన్ రైతుల బాగు కోసం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. పంటకు మద్దతు ధర అందజేస్తున్నది ఏపీయేనని స్పష్టంచేశారు.