Begin typing your search above and press return to search.

పర్ఫెక్ట్ డాగ్ మ‌మ్మీ అంటే ఇలా ఉండాలి

By:  Tupaki Desk   |   15 May 2022 12:30 AM GMT
పర్ఫెక్ట్ డాగ్ మ‌మ్మీ అంటే ఇలా ఉండాలి
X
దిశా పటాని మ‌మ్మీ అయ్యింది! ఇంత‌కీ పెళ్లెప్పుడ‌య్యింది అని ప్ర‌శ్నించొద్దు. దిశా ప‌టానీ ఇన్ స్టాలో తాజా యాక్టివిటీస్ ప‌రిశీలిస్తే ...ఈ స‌న్న‌జాజి అందం 'డాగ్ మ‌మ్మీ'గా మారింద‌ని చెప్పొచ్చు. ఓ వైపు అందాల ఆర‌బోత‌.. మ‌రోవైపు పెట్ డాగ్స్ పై అప‌రిమిమైన ప్రేమ‌తో దిశా ప‌టానీ ఆక‌ట్టుకుంటోంది.

2016 చిత్రం MS ధోని: ది అన్ టోల్డ్ స్టోరీలో తొలిసారిగా నటించింది. అప్పటి నుండి కెరీర్ ప‌రంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె అద్భుతమైన లుక్స్ - ఆక‌ర్షించే నృత్య భంగిమ‌ల‌కు వీరాభిమానులున్నారు. సోషల్ మీడియా ని షేక్ చేసేంత‌గా దిశా తన ఉనికిని ఆస్వాధిస్తోంది. ఇటీవ‌ల‌ తన ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఈ వేదిక‌పై తన వ్యక్తిగత జీవితంలోని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది.

ఇన్ స్టా వీక్షించాక‌... దిశా గర్వించదగిన డాగ్ మమ్మీ గా ఎందుకు మారిందో అర్థ‌మ‌వుతుంది.. త‌న పెంపుడు కుక్క పిల్ల‌ పూచెస్ ని దిశా చాలా ఇష్టపడుతుంది! దానిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది.

నిజానికి త‌న‌ బొచ్చు కుక్క పిల్ల‌కు కూడా ఇన్ స్టాలో బోలెడంత ఫాలోయింగ్ ఉంది! శుక్రవారం నాడు దిశా తన కుక్కపిల్ల చి చితో షికార్ చేస్తున్న ఫోటోని షేర్ చేయ‌గా క్ష‌ణాల్ల వైర‌ల్ అయ్యింది. ప‌ప్పీ ఈ ఫ్రేమ్ లో చాలా క్యూట్ గా క‌నిపిస్తోంది.

దిశా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పూచ్ చి చి త‌న‌తో ఉన్న‌ప్ప‌టి అందమైన ఫోటోను షేర్ చేసింది. ఛీ చి బేబీ స్ట్రోలర్ లో కూల్ గా క‌నిపించింది. మమ్మీ దిశా త‌న‌తో కలిసి విమానాశ్ర‌యంలో అటూ ఇటూ తిరుగుతూ క‌నిపించింది. దిశా ఎంతో అందమైన పింక్ బకెట్ టోపీ - పింక్ ఫ్యానీ ప్యాక్ తో ఎంతో అందంగా క‌నిపించింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ డ్రామా యోధా షూటింగ్ ను ఇటీవల పూర్తి చేసింది. ఆమె ఇతర వృత్తిపరమైన కమిట్ మెంట్ లలో ఈ సంవత్సరం పూర్తి బిజీగా ఉంది. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీ ఏక్ విలన్ 2 లోనూ న‌టిస్తోంది. ప‌లు భారీ చిత్రాల‌కు ఇప్ప‌టికే సంత‌కాలు చేసింది.