ఫైట్లో పడుకొని సిగిరెట్ తాగిన అతిగాడి తాజా ఘనకార్యం.. 'ఈ రోడ్డు మా నాన్నది'

Sat Aug 13 2022 10:19:52 GMT+0530 (IST)

Bobby Kataria Drinking on Dehradan Roads

సోషల్ మీడియాకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తూ.. అప్పటివరకు సాదాసీదాగా ఉండే కొందరు అతి తక్కువ కాలంలో సెలబ్రిటీలుగా మారటం.. లక్షలాది మంది పాలోయర్లు ఉండటం లాంటివి చోటు చేసుకుంటున్నాయి.ఇలా లక్షల్లో ఫాలోయర్లు ఉండే కొందరు బుద్దిగా.. తమ పని తాము చేసుకుంటూ పోతే.. మరికొందరు మాత్రం అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అతి చేస్తున్న వైనం కనిపిస్తూ ఉంటుంది. ఆ కోవలోకే వస్తాడు బాడీ బిల్డర్.. ఇన్ స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోయర్స్ ఉన్న బాబీ కటారియా.

అవును.. ఈ అతిగాడికి సంబంధించిన ఫోటో ఒకటి రచ్చగా మారటం.. ఫ్లైట్ లో పడుకొని సిగిరెట్ తాగి రచ్చ చేసిన ఇతను.. ఇప్పుడు మరో అతి పని చేశాడు.విమానం సీట్లో పడుకొని సిగిరెట్ కాల్చిన ఉదంతానికి సంబంధించి అతడిపై కేసు నమోదు కావటం.. అతగాడి తీరుపై కేంద్ర విమానయాన రంగ అధికారులు సీరియస్ గా ఉండటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా ఉత్తరాఖండ్ లోని డెహ్రాదూన్ - ముస్సోరీ రహదారి మధ్యలో కుర్చీ వేసుకొని మందు తాగుతున్న వీడియోను తయారు చేసి.. లోకం మీదకు వదిలాడు. అందులో అతగాడు రోడ్డు మధ్యలో మద్యం సేవిస్తూ ఉంటే.. వెనుక నుంచి రోడ్స్ ఆప్నే బాప్ కీ అన్న  పాట వచ్చేలా చేశాడు. అంటే.. ఈ రోడ్డు మా బాబుది అంటూ తనలోని అతి మొత్తాన్ని ప్రదర్శించాడు ఈ అతిగాడు.

దీంతో.. ఇతగాడి మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే విషయాన్ని రాష్ట్ర డీజీపీ సైతం ప్రకటన చేశారు. దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ కల్చర్ ను కటారియా నాశనం చేస్తున్నాడంటూ పలువురు మండిపడుతున్నారు.

ఇతగాడి బలం.. ఇతడి అతి చేష్టలు మొత్తం అతన్ని ఫాలో అయ్యే 6.3 లక్షల మందితోనే అన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వారిని అన్ ఫాలో కావాల్సిన అవసరం ఉంది. భాద్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి మద్దతు ఇవ్వటం నైతికంగా కూడా తప్పే అవుతుంది.