Begin typing your search above and press return to search.

ఆకాశంలో అద్భుతం , బ్లూ మూన్ ఆవిష్కరణ .. అసలు మ్యాటర్ ఏమిటంటే !

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:30 AM GMT
ఆకాశంలో అద్భుతం , బ్లూ మూన్ ఆవిష్కరణ .. అసలు మ్యాటర్ ఏమిటంటే !
X
ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోబోతుందో .. మళ్లీ మీరు జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని చూడలేరు అంటూ గత కొన్నిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. ఈ విశ్వం ఎంతో అనంతమైనది. మనం విశ్వం గురించి తెలుసుకున్నా కూడా , ఇంకా తెలియనిది ఎంతో ఉంటుంది. మనకి తెలియని ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాలని విశ్వాన్ని శోధించాలని, అదంతా మానవాళికి వెల్లడి చేయాలని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రుడి గురించి ఒక విషయం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అక్టోబర్ 31వ తేదీన చంద్రుడు నీలం రంగులోకి మారిపోతాడని తెగ వైరల్ అవుతుంది.

దీనితో , నిజంగా చంద్రుడు నీలం రంగులోకి మారిపోతాడా అనే చర్చ విపరీతంగా ఎక్కువగా జరుగుతుంది. ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా చర్చలు నడుస్తున్నాయి. ఐతే ఈ విషయమై ప్లానెటరీ సొసైటీ చెప్పిన ప్రకారం చంద్రుడు నీలం రంగులోకి మారడం అనేది నిజం కాదని తెలుస్తుంది. సూర్యుని నుండి కాంతిని స్వీకరించి మనకి చల్లని వెన్నలగా ప్రసాదించే చంద్రుడు నీలం రంగులోకి మారి మరింత వెన్నెల కురిపిస్తాడా అనే విషయమై ప్లానెటరీ సొసైటీ క్లారిటీ ఇచ్చింది. ఒక నెలలో రెండు పౌర్ణమిలు వస్తే దాన్ని బ్లూ మూన్ గా పిలుస్తారు. ఈ నెలలో అక్టోబర్ 2వ తేదీన మొదటొ పౌర్ణమి ఏర్పడగా, రెండవ పౌర్ణమి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే బ్లూ మూన్ గా పిలుస్తారు. మొత్తంగా ఈ రోజు ఎదో అద్భుతం జరుగుతుంది అంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త నిజం కాదు అని తెలుస్తుంది. నిజానికి ఇరవై తొమ్మిన్నర రోజులకు ఒకసారి పౌర్ణమి వస్తుంది నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 పౌర్ణములు వస్తాయి. మూడేళ్లకొసారి మాత్రమే ఏడాదిలో 13 పౌర్ణములు వస్తాయి. అప్పుడు ఒక నెలలో రెండు పౌర్ణములు వచ్చే అవకాశం ఉంది. ఆ రెండో పౌర్ణమి ఈరోజు రాబోతోంది. బ్లూమూన్‌ అందరినీ కనువిందు చేయబోతోంది.