Begin typing your search above and press return to search.

ఆ పార్టీకి ముషీరాబాద్ 5 డివిజన్లు స్వీప్ చేసే చాన్స్ ఉందా ?

By:  Tupaki Desk   |   21 Nov 2020 10:50 AM GMT
ఆ పార్టీకి ముషీరాబాద్ 5 డివిజన్లు స్వీప్ చేసే చాన్స్ ఉందా ?
X
దుబ్బాకలో విజయం బీజేపీకి నిజంగానే కొండంత బలాన్ని ఇచ్చిందా? ఎప్పుడూ లేనిది పెద్ద సార్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి జీహెచ్ఎంసీలో కష్టపడాల్సిన పరిస్థితి తెచ్చిందా? తెలంగాణలో ప్రత్యామ్మాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందా? ఒక్కసారిగా జీహెచ్ఎంసీలో సమీకరణాలు మారాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా డివిజన్లలో గెలుపు ఓటములు మారే స్థాయిలో రాజకీయం రంగు మారిందని సర్వేలు ఘోషిస్తున్నాయి. మరి ఆ సర్వేలు ఏమిటీ? ప్రజానాడి ఏం చెబుతోందనేది ఆసక్తిగా మారింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే నామినేషన్లు పూర్తికావడంతో అభ్యర్థులంతా ప్రచార పర్వంలోకి దిగారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని టీఆర్ఎస్ ఏర్పాటు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో 5 డివిజన్లు ఉన్నాయి. ముషీరాబాద్, గాంధీనగర్, కావాటిగూడ, అదికంపేట్, రాంనగర్. అయితే ఒక్క గాంధీనగర్ లో తప్ప టీఆర్ఎస్ కు మిగతా డివిజన్లలో చాలా టైట్ ఫైట్ తప్పదని అంటున్నారు. మిగతా నాలుగింటిలో టైట్ లో 2 శాతం తేడాతో బీజేపీకి.. 2 డివిజన్లు టీఆర్ఎస్ కు కొద్దిగా మెజారిటీ వస్తుందని అంటున్నారు.

అయితే బీజేపీ ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపిస్తున్న దూకుడు.. నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ప్లస్ అవుతోందని.. మొత్తానికి 5 డివిజన్లని బీజేపీకి గెలిపిస్తాం అని ముషీరాబాద్ నాయకులు అంటున్నారు. కానీ అన్ని డివిజన్లలో టైట్ పోటీ ఉంది కాబట్టి ఎవరు గెలిచినా 5కి 5 డివిజన్లు కానీ.. నాలుగు ఒక పార్టీ, 1 సీటు ఇంకొక పార్టీ గెలిచే చాన్స్ ఉంది అని అంటున్నారు.

దుబ్బాక ఎన్నికలకు ముందు ఇక్కడ కాంగ్రెస్ ముందు ఉందట.. అయితే దుబ్బాక ఫలితాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ ఓటర్లు 10శాతం మంది బీజేపీకి షిఫ్ట్ అయ్యారని అంటున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారో.. అయితే ఒక్కటి మాత్రం నిజం.. జీహెచ్ఎంసీలోనూ ఓటర్ల తీరు మారింది. వారు కూడా ఈసారి డిఫెరెంట్ రిజల్ట్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలు బాగా మారిపోవడం ఖాయమని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అది కనిపిస్తుందని అంటున్నారు. ‘తుపాకీ.కామ్’ ఎప్పటికప్పుడు సర్వే సంస్థలతో మాట్లాడి సమాచారం ఇస్తూనే ఉంటుంది.. జీహెచ్ఎంసీలో ప్రజానాడిపై లెట్స్ వెయిట్ అండ్ ఎంజాయ్..