Begin typing your search above and press return to search.

టీడీపీ మిడతల దండుకు బీజేపీ వార్నింగ్ నా?

By:  Tupaki Desk   |   7 July 2020 9:45 AM GMT
టీడీపీ మిడతల దండుకు బీజేపీ వార్నింగ్ నా?
X
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ బీజేపీ నేతలకు అవాజ్య ప్రేమ. ఆయనకు వెన్నుదన్నుగా.. రైట్ హ్యాండ్స్ గా ఉన్న వారంతా ఇప్పుడు బీజేపీలో చేరిపోయారు. అధికార వైసీపీ నుంచి రక్షణ కోసం కొందరు.. అవినీతి అక్రమాల కేసుల్లో బయటపడేందుకు మరికొందరు.. బీజేపీ అవసరాల కోసం ఇంకొందరు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళంలో చేరిపోయారు.

అయితే పార్టీ మారినా కూడా తమ పాత అధినేతపై ప్రేమ మాత్రం ఆ నేతల్లో తగ్గడం లేదు. ఇప్పటికీ టీడీపీకి , చంద్రబాబుకు లాభం చేకూర్చేలానే లాబీయింగ్ చేస్తున్నారు. ఇటీవలే ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో లాబీయింగ్ చేస్తూ బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని దొరికిపోయారు. నిజానికి ఈ ఇష్యూలో నిమ్మగడ్డతో కలిసి పోరాడుతోంది టీడీపీనే.. కానీ ఇక్కడ బీజేపీ నేతల లాబీయింగ్ అభాసుపాలైంది. ఈ క్రమంలోనే బీజేపీ అలెర్ట్ అయ్యింది. బీజేపీలో ఉన్న టీడీపీ మిడతల దండుకు బీజేపీ హెచ్చరికలు పంపుతోందట..

టీడీపీ నుంచి బీజేపీలోకి పోయిన పెద్దలకు ఈ మధ్య వైసీపీ నాయకులు ‘టీడీపీ మిడతల దండు’ అనే పేరు పెట్టారు. అయితే వాళ్లు ఈ మధ్య బీజేపీని బలోపేతం చేయకుండా ఇన్ డైరెక్ట్ గా టీడీపీకి సపోర్ట్ గా మీడియా డిబేట్లలో వీరంతా మాట్లాడుతున్నారు. ఇంకా టీడీపీ నుంచి మరికొందరు పోయి బీజేపీలో చేరి వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడబోతున్నారని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే ఈ విషయంలో బీజేపీ కలుగ జేసుకున్నా కలగజేసుకోకపోయినా ఆ పార్టీకే నష్టమని.. తాము మాత్రం ఈ మిడతల దండును చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారట.. బీజేపీలోని టీడీపీ అనుకూల వాదులకు చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారట.. బీజేపీ కూడా ఇటీవల టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్న వారికి హెచ్చరికలు పంపినట్టు తెలిసింది.