Begin typing your search above and press return to search.

బీహార్ దొంగలా మాజకా.. ఏకం రైలు పట్టాలనే 'లేపేశారు'..!

By:  Tupaki Desk   |   7 Feb 2023 12:12 PM GMT
బీహార్ దొంగలా మాజకా.. ఏకం రైలు పట్టాలనే లేపేశారు..!
X
దొంగతనాలకు అలవాటు పడిన వారికి ఏదో ఒకటి కొట్టయకుండా ఉండలేరు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే చేతికందే వస్తువులనో.. ఓ మోస్తరు బరువున్న వస్తువులనో దొంగిలించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే బీహార్ లోని ఓ దొంగల ముఠా మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించి వార్తల్లో నిలవడం గమనార్హం.

ఇటీవల రైలు ఇంజన్ ను పార్ట్ పార్టులుగా చేసి పట్టుకెళ్లగా బీహార్ దొంగల ముఠా తాజాగా రైలు పట్టాలను సైతం దొచుకెళ్లడం వైరల్ గా మారింది. రైలు ఇంజన్ తో పాటు ట్రాక్ సైతం మాయం కావడంతో రైల్వే అధికారులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ అధికారులు విచారణ చేపట్టగా ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు బయటపడింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో లోహత్ చక్కెర కర్మాగారం ఉండగా అది కొన్నాళ్ల క్రితం మూతపడింది. అప్పట్లో ఈ చక్కెర ఫ్యాక్టరీ నుంచి సరకు లోడింగ్.. అన్ లోడింగ్ కోసం లోపలికి గూడ్స్ రైలు వెళ్లేలా ట్రాక్ నిర్మించారు. అయితే ఫ్యాక్టరీ మూత పడటంతో ఆ ట్రాక్ నిరుపయోగంగా మారింది.

ఈక్రమంలోనే చక్కెర ఫ్యాక్టరీ సామాన్లు తుక్కు కింద కొనుక్కోడానికి ఓ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ కంపెనీకే రైల్వే ట్రాక్ ఊడదీసి పనులు సైతం ఇవ్వాలని అధికారులు ఒప్పందం చేసుకోవాలని భావించారు. అయితే ఈ సమాచారం ముందే లీక్ కావడంతో ఇంటి దొంగల సహకారంతో ఓ ముఠా రైల్వే ట్రాక్ ఊడదీసుకొని పోయింది.

రైల్వే ట్రాక్ మాయం కావడంతో చక్కెర కర్మాగారంలో పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చింది. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా అక్కడ రైల్వే ట్రాక్.. సిమెంట్ కమ్మీలు.. ఏవీ లేవు కనబడలేదు. మొత్తంగా ఊడ్చు కెళ్లారు. అయితే వీటిని తరలించడం అంత సులభం కాదని రైల్వే అధికారులు చుట్టుపక్కల గోడౌన్లలో వెతికారు.

ఓ వ్యక్తి ఇంట్లో కొన్ని పట్టాలు లభించడంతో రైల్వే అధికారులు విచారణ వేగవంతం చేశారు. తీగలాగితే డొంక కదిలిన చందంగా ఇందులో రైల్వే అధికారుల హస్తం ఉన్నట్లు వెలుగుచూసింది. దీంతో ఇద్దరు రైల్వే సిబ్బందిని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఆర్పీఎఫ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దొంగల ముఠా నాయకుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

అయితే ఇలాంటి భారీ దొంగతనాలు బీహార్లో కొత్త కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఓ ఇంటిపై అమర్చిన సెల్ టవర్ ను సైతం ఓ దొంగ ముఠా ఎత్తుకెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తాజా రైలు ఇంజన్ ను కాకుండా ఏకంగా పట్టాలను సైతం ఎత్తుకెళ్లి బీహార్ దొంగలు మామూలోళ్లు కాదని మరోసారి నిరూపించుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.