Begin typing your search above and press return to search.

హైదరాబాద్ హబ్.. ఇక ఉద్యోగాలకు తిరుగుండదు..

By:  Tupaki Desk   |   18 Aug 2019 10:39 AM GMT
హైదరాబాద్ హబ్.. ఇక ఉద్యోగాలకు తిరుగుండదు..
X
హైదరాబాద్.. ఎందుకంత ప్రత్యేకం.. ఇక్కడ క్లైమట్ లో ఏముంది. భారత్ లోనే ఎక్కడా లేని సమశీతోష్ణ ఉష్ణోగ్రత హైదరాబాద్ లో ఉంటుంది. అన్ని సమపాళ్లలో ఉంటాయి. పైగా దక్కన్ పీఠభూమి.. భూకంపాలు వచ్చే చాన్స్ లేదు. ఇక సౌత్, వెస్ట్ లో నల్లమల మడ అడవులు. వికారాబాద్ ఫారెస్ట్.. మంచి ఆక్సిజన్ లెవల్స్ అందించేలా ప్రకృతి వరం. అందుకే ఇన్ని ప్రత్యేకతలున్న నగరం కాబట్టే హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశంగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను హైదరాబాద్ తరలివచ్చేలా చేస్తోంది.

ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజం గూగుల్, సోషల్ మీడియా సంచలనం ఫేస్ బుక్, ఇక అమెరికాకు చెందిన దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, యాపిల్.. క్వాల్ కామ్.. ఇలా ఎన్నో ఎన్నెన్నో హైదరాబాద్ లో కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.. ఉపాధినిస్తున్నాయి. ఉపాధికి ఊతం ఇస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సిగలో మరో కలికితురాయి చేరింది.

ప్రప్రంచ ప్రఖ్యాత నంబర్ 1 ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో పూర్తి చేసింది. దాదాపు 9వేల మందికి ఉద్యోగులు ఇచ్చింది. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్నారు. నానక్ రాంగూడలోని 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. ఈనెల 21న సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 26వేల నుంచి 30వేల మంది వరకు ఇందులో పనిచేసేలా మౌళిక వసతులున్నాయి.

అమేజాన్ కంపెనీ హైదరాబాద్ కు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే దేశంలోఅతిపెద్ద గోదాంను శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో నిర్మించి ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను నిర్మించింది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో వేలమందికి ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రపంచప్రఖ్యాత కంపెనీలన్నీ హైదరాబాద్ కు తరలివస్తుండడం ఉపాధి కల్పిస్తుండడం ఇక్కడి నిరుద్యోగులకు వరంగా మారనుంది.