Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్‌లో ఇక ఎలిమినేషన్​ ఉండదు.. కొత్త ప్రక్రియ స్టార్ట్​

By:  Tupaki Desk   |   20 Oct 2020 5:30 AM GMT
బిగ్‌బాస్‌లో ఇక ఎలిమినేషన్​ ఉండదు.. కొత్త ప్రక్రియ స్టార్ట్​
X
అంతర్జాతీయంగా ఎంతో సక్సెస్​ అయిన ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో తెలుగులోనూ ఎంతో ఆదరణ పొందింది. అయితే ప్రస్తుతం ఈ షోలో ఓ సరికొత్త ప్రక్రియ మొదలు కాబోతున్నట్టు సమాచారం. బిగ్​బాస్​లో వారం వారం ఓ సభ్యుడు ఇంటి నుంచి ఎలిమినేట్​ అవుతుండటం మనకు తెలిసిందే. అయితే ఇక మీదట ఎలిమినేషన్​ అనే ప్రక్రియను పూర్తిగా తీసేయనున్నారట. ప్రస్తుతానికి బాలీవుడ్​లో ఈ విధానం స్టార్ట్​ చేస్తారు. అక్కడ సక్సెస్​ అయితే మిగిలిన ప్రాంతీయభాషల్లోనూ ఈ ప్రక్రియ మొదలుపెడతారు. ‘ఇన్విజిబుల్’ అనే పేరుతో ఈ కొత్త ప్రక్రియ ఉంటుందట. తొలి ప్రయత్నంగా బిగ్‌బాస్-14లో దీన్ని అమలు చేయనున్నారు.

హిందీ బిగ్‌బాస్ లో నో ఎలిమినేషన్​

ఈ సారిలో హిందీ బిగ్‌బాస్-14 ఎలిమినేషన్ ఉండదట. ఎలిమినేషన్‌కు బదులుగా ఇన్విజిబుల్ అనే ప్రక్రియను తెరమీదికి తీసుకొచ్చారు షో నిర్వాహకులు. బిగ్‌బాస్-14 సీజన్‌లో ఈ సారి షెహజాద్ డియోల్, అభినవ్ శుక్లా, జాన్ కుమార్ సాను ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఈ సారి ఎలిమినేషన్ ప్రక్రియ ఉండబోదని, దానికి బదులుగా ఇన్విజిబుల్‌గా ఉండాల్సి ఉంటుందని హోస్ట్ సల్మాన్ ఖాన్ వెల్లడించారు. షెహజాద్ డియోల్.. ఇన్విజిబుల్‌గా ఉంటారని తెలిపారు.

ఏమిటీ ఇన్విజబుల్​..

ఇన్విజిబుల్ సభ్యుడు బిగ్​బాస్​ హౌస్​లోనే ఉంటాడు. కానీ అతడికి హౌస్​లో ఏ టాస్క్​లు ఇవ్వరు. నిర్ణయాత్మక అంశాలకు సంబంధించిన డిస్కషన్స్‌లో ఇన్విజిబుల్ మెంబర్ భాగం పంచుకోడు. ఒకరకంగా చెప్పాలంటే.. హౌస్‌లో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అనే విధానంలో సాగుతుంది ఇది. బిగ్‌బాస్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఆ కంటెస్టెంట్.. ఇన్విజిబుల్‌గానే ఉండాల్సి వస్తుంది. బిగ్‌బాస్ జారీ చేసే ఆదేశాల ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు అతని ప్రవర్తన నచ్చకపోతే.. ఏ క్షణమైనా హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. హిందీ బిగ్‌బాస్-14 సీజన్‌లో ఇన్విజిబుల్ మెంబర్‌గా షెహజాద్ డియోల్‌ను ఎంపిక చేశారు. హీనా ఖాన్, గౌహర్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లాలు ముగ్గురు జూనియర్ హౌస్‌మేట్స్‌ను ఎలిమినేషన్ కోసం ఎంపిక చేశారు.