వివాదాస్పద నిర్ణయం తీసుకున్న బైడెన్.. అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత

Mon Jan 25 2021 11:46:41 GMT+0530 (IST)

Biden made the controversial decision

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నది. ట్రాన్స్జెండర్లకు సమాన హక్కులు కల్పిస్తూ ఆయన ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం ప్రకారం ట్రాన్స్జెండర్లు మహిళలతో కలిసి క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చు. అయితే ఈ నిర్ణయాన్ని మహిళా క్రీడాకారులు సాధారణ అమెరికన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు మహిళల కంటే బలంగా ఉంటారని వారి వాదన. ఒకవేళ మహిళలు ‘ట్రాన్స్జెండర్లు కలిసి క్రీడాపోటీల్లో పాల్గొంటే .. ట్రాన్స్జెండర్లు గెలిచే అవకాశం ఉంటుంది.శారీరకంగా ట్రాన్స్జెండర్లు పురుషులతో సమానంగా ఉంటారు. వాళ్లతో కలిసి పోటీపడటమంటే మహిళలు పురుషులతో పోటీ పడటం లాంటిది.అటువంటప్పుడు పోటీకి అర్థం ఏముంది’ అంటూ వాళ్లు ఆరోపిస్తున్నారు.  ట్రాన్స్జెండర్లు సమానం అన్న నిర్ణయం కరెక్టే కావచ్చు. కానీ అథ్లెట్స్ విషయంంలో ఆ నిర్ణయం సరికాదంటున్నారు కొందరు. బైడెన్ తీసుకున్న నిర్ణయం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా.. మహిళా క్రీడాకారులు సాధారణ జనాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బైడెన్ తీసుకున్న నిర్ణయం ప్రకారం .. ట్రాన్స్జెండర్లకు సమానహక్కులు కల్పిస్తే.. క్రీడల్లో మహిళలు ట్రాన్స్జెండర్లతో సమానంగా పోటీపడలేరు.‘మహిళల స్పోర్ట్ ఈవెంట్‌కి ట్రాన్స్ మహిళల్ని అనుమతించకండి. వాళ్లు బలంగా ఉంటారు. వాళ్లతో పోటీ పడితే మేము ఓడిపోతాం’’ అని క్రీడారంగంలోని అమెరికన్ మహిళలు బైడెన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ‘కరెక్టే’ అని రిపబ్లికన్‌లు మద్దతు ఇస్తున్నారు.